సమోసా కోసం రైలు ఆపిన లోకో ఫైలెట్.. కట్‌చేస్తే.. రంగంలోకి భారతీయ రైల్వే!

భారతీయ రైల్వేస్‌లో రైళ్ల రాకపోకలు, సమయపాలన, ప్రయాణికుల భద్రత అత్యంత కీలకమైనవి. లోకో పైలట్లు అత్యవసర పరిస్థితుల్లో లేదా సిగ్నల్ పడినప్పుడు మాత్రమే రైలును ఆపాల్సి ఉంటుంది. కానీ, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఒక వీడియోలో లోకో పైలట్‌ చేసిన పని సర్వత్రా విమర్శలకు దారితీసింది... వేడి వేడి కచోరీల కోసం ఒక లోకో పైలట్ ఏకంగా ప్యాసింజర్ రైలును నడిరోడ్డుపై ఉన్న క్రాసింగ్ వద్ద ఆపేసిన విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో రైల్వే శాఖ తీవ్రంగా పరిగణించి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పూర్తి వివరాల్లేంటో ఇప్పుడు చూద్దాం..

సమోసా కోసం రైలు ఆపిన లోకో ఫైలెట్.. కట్‌చేస్తే.. రంగంలోకి భారతీయ రైల్వే!
Train Stopped For Samosas

Updated on: Jul 08, 2026 | 1:55 PM

భారతీయ రైల్వేస్ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థలలో ఒకటి. లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే రైళ్లకు సమయపాలన, భద్రత అత్యంత కీలకం. అయితే, రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన ఒక విచిత్రమైన ఘటన రైల్వే శాఖను ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా, ప్రయాణికుల భద్రతపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేలా చేసింది. కేవలం సమోసాల కోసం ఒక లోకో పైలట్ ప్యాసింజర్ రైలును నడిరోడ్డుపై ఉన్న రైల్వే క్రాసింగ్ వద్ద ఆపేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అసలేం జరిగిందంటే..

వైరల్ అయిన వీడియో ప్రకారం.. అల్వార్‌లోని దాద్ కరౌలి రైల్వే క్రాసింగ్ వద్దకు ఒక ప్యాసింజర్ రైలు వచ్చి ఆగిపోయింది. రైలు వస్తోందని గేట్‌మెన్ అప్పటికే గేట్లు మూసివేయడంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే స్టేషన్ రాకముందే, క్రాసింగ్ గేటుకు అతి సమీపంలో డ్రైవర్ రైలును ఆపేశాడు. వెంటనే ట్రాక్ పక్కన నిలబడిన ఒక వ్యక్తి చేతిలో ఉన్న వేడి వేడి సమోసాల ప్యాకెట్‌ను లోకో పైలట్ క్యాబిన్ వైపు అందించాడు. డ్రైవర్ దానిని అందుకోగానే, రైలు హారన్ మోగిస్తూ ముందుకు సాగింది. ఈ దృశ్యాన్ని అక్కడ ట్రాఫిక్‌లో ఆగిన ఒక వాహనదారుడు తన మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వైరల్ వార్తలో నిజమెంత?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ చిన్న విషయాన్నైనా తప్పుడు సమాచారంతో వైరల్ చేయడం చాలా సులభమైపోయింది. ఈ వీడియో కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఉత్తర పశ్చిమ రైల్వే విభాగం తీవ్రంగా స్పందించింది. ప్రాథమిక విచారణ అనంతరం, రైల్వే నిబంధనలను ఉల్లంఘించి, ప్రయాణికుల ప్రాణాలను, ప్రజా రక్షణను ప్రమాదంలో పడేసినందుకు గానూ కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు లోకో పైలట్ల తో పాటు, విధుల పట్ల నిర్లక్ష్యం వహించి వారికి సహకరించిన ముగ్గురు రైల్వే గేట్‌మెన్లను కూడా తక్షణమే సస్పెండ్ చేసినట్టుగా వార్తలు వైరల్ గా మారాయి.

అసలు వాస్తవం ఇదీ:

 

వీడియో ఇక్కడ చూడండి..

ఇదిలా ఉంటే.. భారతీయ రైల్వే దీనిపై స్పందించింది. ఎక్స్ వేదికగా ఇదంతా తప్పుడు వార్తలంటూ కొట్టిపారిసింది. సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లు అది ప్రయాణికులు ఉన్న డెము రైలు కాదు. అది 27237, 27600 నంబర్లు గల రెండు ఇంజన్లతో నడుస్తున్న CGPT గూడ్స్ రైలుగా వెల్లడించింది. లోకో పైలట్ సమోసాలు కొనడానికి రైలును ఆపలేదు. రావు రైల్వే యార్డు పరిధిలోని ట్రాక్‌లపై అత్యవసర ఇంజనీరింగ్ మరమ్మతు పనులు జరుగుతున్నాయి.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ కారణంగా గూడ్స్ రైలు ముందుకు వెళ్లడానికి సిగ్నల్ దొరక్కపోవడంతో, నిబంధనల ప్రకారం దానిని రావు హోమ్ సిగ్నల్ వద్ద నిలిపివేయాల్సి వచ్చింది. రైలు సాంకేతిక కారణాల వల్ల అక్కడ ఎలాగో ఆగి ఉండటంతో, ఆ ఖాళీ సమయంలో అసిస్టెంట్ లోకో పైలట్ కిందికి దిగి సమీపంలో ఉన్న షాప్ నుండి సమోసా, కచోరీలను కొనుగోలు చేశారని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us