Funny Video: అమ్మబాబోయ్.. ఇదెక్కడి డ్రామా రా బాబూ.. ఈ చిన్నారి యాక్టింగ్ చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..

|

Jan 23, 2022 | 8:34 AM

Viral Video: సహజంగానే చిన్న పిల్లలు ఏం చేసినా చాలా ఫన్నీగా ఉంటుంది. వారి చిరునవ్వు, వారు చెప్పే అబద్ధాలు,..

Funny Video: అమ్మబాబోయ్.. ఇదెక్కడి డ్రామా రా బాబూ.. ఈ చిన్నారి యాక్టింగ్ చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..
Follow us on

Viral Video: సహజంగానే చిన్న పిల్లలు ఏం చేసినా చాలా ఫన్నీగా ఉంటుంది. వారి చిరునవ్వు, వారు చెప్పే అబద్ధాలు, అందమైన చిట్టిపొట్టి మాటల అందరినీ ఎంతగానో అలరిస్తుంటాయి. ముఖ్యంగా వారు చేసే అల్లరి పీక్స్ అని చెప్పాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే.. చిన్న పిల్లలు అయిన అన్నాచెల్లెల్ల గోల అయితే భరించలేం బాబోయ్ అనేలా ఉంటుంది. ఒకరిపై ఒకరు చాడీలు, అబద్ధాలు, కొట్టుకోవడాలు, ఏడుపులు మామూలుగా ఉండవనుకోండి. తాజాగా ఓ చిన్నారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఆ వీడియో చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవడం ఖాయం. ఎందుకంటే.. ఆ వీడియోలోని చిన్నారి యాక్టింగ్ చూస్తే మహానటి సావిత్రినే మించిపోయిందని చెప్పాలి.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో చిన్న పాప తన అన్నయ్యతో కలిసి ఆడుకుంటోంది. చిన్నోడు ఏడుస్తుండగా.. వాడి నుంచి బొమ్మ లాక్కునేందుకు ప్రయత్నిస్తుంటుంది. వాడు ఎంతకీ వదలకపోవడంతో.. పెద్ద ప్లానే వేసింది. తెలివిగా పెద్దగా అరుస్తూ వెనక్కి కిందపడిపోయింది. అలా, అన్నయ్య తనను కొట్టినట్లు తల్లిదండ్రులను నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ తరువాత మరో సీన్‌లోనూ అదే యాక్షన్ రిపీట్ చేసింది. కారు బొమ్మతో ఆడుకునేందుకు ప్రయత్నించగా.. అంతలోనే వచ్చిన బుడ్డోడు ఆ బొమ్మను లాగేసుకున్నాడు. ఇంకేముంది.. ఆ చిన్నారిలోని మహానటి నిద్రలేచింది. పక్కనే ఉన్న సోఫాసెట్‌కు కొట్టుకుని.. ఆ చిన్నోడు కొట్టినట్లు బిల్డప్ ఇచ్చింది. వామ్మో ఆ చిన్నారికి ఇప్పుడే ఇంత నటనా చాతుర్యం ఉంటే పెద్దయ్యాక పరిస్థితి ఏంటో అని వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఫన్నీ వీడియోను @TheFigen అనే ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశేరు యూజర్. ఆ వీడియోకు ‘బై బర్త్ డ్రామా క్వీన్’ అంటూ క్యాప్షన్ పెట్టారు. కాగా, 9 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. వీడియోను ఇప్పటి వరకు 40 వేల మందికిపైగా వీక్షించగా.. అంతేస్థాయిలో లైక్స్ వచ్చాయి. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also read:

రోజు రోజుకు మారుతున్న యూపీ ఎన్నికల ముఖచిత్రం.. అఖిలేష్ యాదవ్ పార్టీలోకి దేశంలో అత్యంత ఎత్తైన వ్యక్తి..

Coconut Benefits: రాత్రి నిద్రపోయే ముందు పచ్చి కొబ్బరి తింటే ఎన్నో ప్రయోజనాలు.. మీరు తెలుసుకోండి..

Hyderabad: అయ్యో..! ప్రాణం తాసిన లుంగీ.. చోరీకి వచ్చి లోపలికి వెళుతుండగా.. అసలేమైందంటే..