Lion vs Leopard: అడవిలో నివసించే క్రూరమైన జంతువుల్లో మృగరాజు సింహం, చిరుత పులి ప్రధానమైనవి. వీటి వేట అత్యంత భయానకంగా ఉంటుంది. ఆకలిగా ఉన్న సమయంలో వీటి కంట ఇతర జీవి పడిందో అంతే సంగతులు. భూమిపైనా, నీటిలోనూ, చెట్ల పై నుంచి కూడా వేటాడే సామర్థ్యం చిరుత సొంతం. అదే సమయంలో అడవికి పెద్దన్నలా వ్యవహరిస్తుంది మృగరాజు సింహం. దాని బలం ముందు ఏ జంతువైనా తోక ముడవాల్సిందే. అలాంటి క్రూర జంతువులు అడవి పంది మాంసం కోసం కొట్టుకున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
చిరుతపులి చురుకుదనం ముందు ఇతర జంతువులన్నీ దిగదుడుపే. కడుపు నింపుకోవడం కోసం అది ఇతర జంతువులను నిర్దాక్షిణ్యంగా చంపుతుంది. అదే సమమయంలో సింహం విషయానికి వస్తే.. దాని బలం, శక్తి సామర్థ్యాల ముందు ఏదీ నిలవలేదు. మృగరాజు ఒక్కసారి గర్జిస్తే అడవి అంతా వణికిపోతుంది. ఈక్రమంలోనే తన బలంతో చిరుత పులి కష్టడపి వేటాడిన అడవి పందిని కూడా లాక్కుంది. ఈ వీడియోలో అడవి పందిని తింటోన్న పులి సింహం కంట పడుతుంది. అంతే నేరుగా పులి దగ్గరకు వెళుతుంది. దాని నోటి కాటి తిండిని లాక్కోవాలని చూస్తుంది. అయితే చిరుత మొదట కొద్దిగా కోపంగా చూస్తుంది. అయితే ఇంతలో మరొక సింహం అక్కడి కొస్తుంది. దీంతో సింహంతో పోరాడలేక అక్కడి నుంచి తప్పించుకుని దూరంగా పారిపోతుంది పులి. ఈ నేపథ్యంలో తన నోటి కాడికి వచ్చిన దాన్ని సింహాలు ఆరగించడం చూసి సహించలేకపోతుంది. అయితే వాటిని ఎదిరించే బలం లేక మిన్నకుండిపోతుంది. మాసాయి సైటింగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఇప్పటివరకు సుమారు 1.64 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. దీనిని చూసిన వారంతా ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘చిరుతపులి అదృష్టం నిజంగా బాగుంది’ ‘ అడవికి మృగరాజు సింహం.. దాని బలం ముందు ఏదైనా దిగదుడుపే ‘ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..