
జూలో సఫారీ చేస్తున్న పర్యాటకుల వాహనం ఓ చిరుతపులి దాడి చేసిన ఘటన బెంగళూరులోని బన్నెర్ఘట్ట జాతీయ ఉద్యానవనంలో చోటుచేసుకుంది. చిరుత దాడిలో చెన్నైకి చెందిన ఒక మహిళ స్వల్పంగా గాయపడింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (KSTDC) వాహనంలో 10 మందికి పైగా సందర్శకులు పార్క్‌లోని సఫారీ జోన్ గుండా వెళ్తున్నారు. వాహనంలో ఉన్న 50 ఏళ్ల వాహిత్ బాను అనే మహిళ తన భర్త, కుమారుడితో కలిసి వాహనం కిటికీలోంచి పార్క్‌లోని జంతువులను చూస్తుంది.
సరిగ్గా అదే సమయంలో ఒక చిరుతపులి ఊహించని విధంగా బస్సుపైకి దూకింది, ఇది ప్రయాణికులను ఆశ్చర్యపరిచింది. కొద్దిసేపు భయాందోళనకు గురిచేసింది. గందరగోళంలో, వాహిత్ బాను చేతికి చిన్న గాయమైంది. వెంటనే అప్రమత్తమైన జూ సిబ్బంది వాహనాన్ని అక్కడి నుంచి సేఫ్ ప్లేస్‌లోకి తీసుకెళ్లారు. అనంతరం గాయపడిన మహిళను హాస్పిటల్‌కు తరలించారు.
Bannerghatta Safari Turns Tense as Leopard Climbs onto Tourist Bus; Swift Action Ensures Safety, Chennai Woman Stable
Around 1 PM, an unexpected incident took place at Bannerghatta National Park in Bengaluru, when a leopard leapt onto a safari bus, slightly injuring a woman… pic.twitter.com/4i9osIJQUR
— Karnataka Portfolio (@karnatakaportf) November 13, 2025
చిరుతపులి ఆకస్మిక దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “సఫారీల సమయంలో భద్రతా సూచనలను జాగ్రత్తగా పాటించాలని, వాహనం నుండి బయటకు తల, చేతులు పెట్టరాదని పార్క్ అధికారులు పర్యాటకులను కోరారు. ఇటువంటి సంఘటనలు చాలా అరుదు, చిరుతపులులు స్వతహాగా దూకుడుగా ఉండవని, అవి ఆసక్తిగా లేదా ఆశ్చర్యపోయినప్పుడు ఇలా ప్రవర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు.
గమనిక: ఈ నివేదిక సోషల్ మీడియా నుండి యూజర్లు రూపొందించిన కంటెంట్ ఆధారంగా రూపొందించబడింది. ఈ వాదనలను మేము స్వతంత్రంగా ధృవీకరించలేదు వాటిని ఆమోదించదు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.