AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వీడు చాలా వైలెంట్.. భయం లేకుండా పాముతో ఆడుకున్న పిల్లోడు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!

ఓ చిన్న పిల్లోడు తన చేతిలో ఉన్న ఆకుపచ్చ రంగు పాముతో ఆడుకుంటున్నాడు. ఇదేంటి పాముతో ఆటలా.? అని మీరు అనొచ్చు.! అవునండీ నిజమే..

Viral Video: వీడు చాలా వైలెంట్.. భయం లేకుండా పాముతో ఆడుకున్న పిల్లోడు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!
Viral Video
Ravi Kiran
|

Updated on: Jan 28, 2022 | 5:41 PM

Share

సోషల్ మీడియాలో ప్రతీ రోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని మనల్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాగే ఇంకొన్ని చూసినప్పుడు మన కళ్లను మనమే నమ్మలేం. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ చిన్న పిల్లోడు తన చేతిలో ఉన్న ఆకుపచ్చ రంగు పాముతో ఆడుకుంటున్నాడు. ఇదేంటి పాముతో ఆటలా.? అని మీరు అనొచ్చు.! అవునండీ నిజమే.. ఆ పిల్లోడు పాముతో ఆటలు ఆడుతున్నాడు. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ వీడియో ప్రకారం.. సరీసృపాలను ఉంచే ఓ జూ లాంటి ప్రదేశంలో ఓ పిల్లాడు నిలబడి ఉన్నట్లు.. అతడి చేతుల్లో ఆకుపచ్చని రంగులో ఉన్న ఓ పాము ఉన్నట్లు మీరు చూడవచ్చు. ఇక ఆ పాము పిల్లాడి శరీరంపై పాకుతోంది. ఇక్కడ ఆశ్చర్యమేంటంటే.. ఆ పిల్లాడు ఏ భయం లేకుండా పామును పట్టుకుని నవ్వుతున్నాడు. పామును ఓ బొమ్మలా అనుకుని దానితో ఆడుతున్నాడు. దీనిని చూసిన తర్వాత గూస్‌బంప్స్ రావడం ఖాయం.

కాగా, ఈ వీడియోను ‘Snake_World’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ పోస్ట్ చేసింది. జనవరి 14న ఈ వీడియో అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు 28 వేల మందికి పైగా చూశారు. రోజురోజుకూ వ్యూస్ పెరుగుతూపోతున్నాయి. ఇక దీనిని చూసిన నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పాములు ఏవీ ఆటబొమ్మలు కాదని.. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలని హితబోధ చేస్తున్నారు. ‘ అస్సలు పిల్లలను పాములతో ఆట ఆడుకోనివ్వకూడదు. ఏది ఏమైనా పాములు ఆడుకునేవి కావు’ అని కామెంట్ చేయగా.. ‘తల్లిదండ్రులు ఈ విధంగా బాధ్యతారాహిత్యంగా ఉండకూడదు. పాము విషపూరితం కాకపోయినా, అది పిల్లవాడిని కాటేస్తుంది’ అని మరొకరు రాసుకొచ్చారు.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..