Basavaraj Bommai: పెంపుడు శునకానికి కర్ణాటక సీఎం బొమ్మై కన్నీటి వీడ్కోలు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Viral Video - Basavaraj Bommai: క‌ర్నాట‌క ముఖ్యమంత్రిగా బ‌స‌వ‌రాజు బొమ్మై బుధవారం ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన వీడియో

Basavaraj Bommai: పెంపుడు శునకానికి కర్ణాటక సీఎం బొమ్మై కన్నీటి వీడ్కోలు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Basavaraj Bommai Viral Video

Updated on: Jul 29, 2021 | 7:18 PM

Viral Video – Basavaraj Bommai: క‌ర్నాట‌క ముఖ్యమంత్రిగా బ‌స‌వ‌రాజు బొమ్మై బుధవారం ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారంతా బొమ్మై జంతు ప్రేమికులు అంటూ కొనియాడుతున్నారు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావడం మంచి విషయం అంటూ మెచ్చుకుంటున్నారు. అయితే.. ఈ వీడియో పాతదే అయినప్పటికీ.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. తన పెంపుడు కుక్కకోసం బొమ్మై కన్నీళ్లు పెట్టకున్నారు. వాస్తవానికి పెంపుడు కుక్క కొన్ని నెలల క్రితం చనిపోయింది. అనంతరం బొమ్మై కుటుంబసభ్యులు కుక్కకు వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోలో సీఎం బొమ్మై కన్నీళ్లు తుడుచుకోవడం కనిపిస్తుంది. కుటుంబసభ్యులు కూడా మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. పెంపుడు కుక్క మరణించడంతో బొమ్మై కుటుంబసభ్యులంతా షాక్‌కు గురయ్యారు. కుక్క కళేబరానికి పూల దండలు వేసి.. అందరూ ఏడుస్తూ శోకసంద్రంలో మునిగిపోయారు. బొమ్మై, ఆయన భార్య, కూతురు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు బొమ్మై ట్విట్ చేస్తూ.. ఈ విధంగా పేర్కొన్నారు. తమ పెంపుడు కుక్క సన్నీ చనిపోయిందని.. తమ ఇంట్లో ఓ సభ్యుడు చనిపోయినట్లు ఉందని పేర్కొన్నారు. తామంతా విచారంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే.. ప్రస్తుతం ఆయన సీఎం అయిన తర్వాత.. మానవతావాది సీఎం బొమ్మై అంటూ నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

వీడియో.. 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారంతా పలు కామెంట్లు చేస్తున్నారు. బొమ్మై జంతుప్రేమికులు అంటూ కొనియాడుతున్నారు.

Also Read:

Snake Bite: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. కాటేసిన పామును వెంటాడి మరి చంపాడు.. ఆ తర్వాత

Meerpet: మహిళ చెంప చెల్లుమనిపించిన మేయర్ భర్త.. రేషన్ కార్డు అడిగినందుకు..