Dance Video: సోషల్ మీడియాలో ఏది ఎప్పుడు ట్రెండ్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం విడుదలైన బార్‌బార్‌దేఖో సినిమాలోని ‘కాలా చష్మా’ పాట ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా వేసిన స్టెప్పులను మళ్లీ రీక్రియేట్ చేస్తున్నారు. క్రికెటర్ల నుంచి విదేశీయుల వరకు ఈ సాంగ్‌కు తమదైన శైలిలో స్టెప్పులేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా కొందరు మగువలు కాలాచష్మా పాటకు అద్భుతంగా కాలు కదిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా అత్తలు, కోడళ్లు కలిసి పాల్గొన్న ఈ పార్టీలో ఒకరి తర్వాత ఒకరు కాలాచష్మా సాంగ్ హుక్‌స్టెప్‌ను రీక్రియేట్ చేశారు. మోకాళ్లపై వంగి డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. 2016లో విడుదలైన బార్‌బార్ దేఖో సినిమాలోని కాలాచష్మా పాట సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో కత్రినా, సిద్ధార్థ్ వేసిన ఐకానిక్ స్టెప్పులు ఓ రేంజ్‌లో హిట్టయ్యాయి. కాగా కొద్ది రోజుల క్రితం నార్వేజియన్ డ్యాన్స్ గ్రూప్ ఈ పాటకు అద్భుతంగా స్టెప్పులేయడంతో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఆతర్వాత టీమిండియా క్రికెటర్లు, హాంకాంగ్ క్రికెటర్లు కూడా ఈ పాటకు స్టెప్పులేశారు.
What a dance #KalaChashma ?
#Aunty pic.twitter.com/qDTyiAp5lv— ????? ?????? (@Komal_Sharma11) August 26, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..