
భక్తిలో శక్తి ఉందేమో.. నమ్మకమే దైవ బలం.. గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో చోటు చేసుకున్న ఒక విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ భక్తి .. అది తీసుకువచ్చే శాంతి .. అద్భుతమైన కలయిక కనిపించింది. విజయదశమి సందర్భంగా గిర్నార్‌లోని ఖోడియార్ మాతా ఆలయంలో ఒక యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో సమీపంలోని అడవి నుంచి మూడు సింహాలు వచ్చి కూర్చున్నాయి. యజ్ఞం చేస్తున్న బ్రాహ్మణులు భయం లేకుండా తమ యజ్ఞాన్ని కొనసాగించారు. సింహాలు అక్కడ ఉన్నవారికి ఎటువంటి హాని చేయలేదు. .. ఈ సమయంలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.
అత్యంత హింసాత్మక జీవులను కూడా శాంతింపజేసే శక్తి భక్తికి ఉంది. జునాగఢ్ లో చోటు చేసుకున్న ఈ దృశ్యం ద్వారా అది తెలుస్తుంది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్యపరిచింది. గిర్నార్ పర్వతంపై ఖోడియార్ మాతాజీ కోసం విజయదశమి రోజున యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఇంతలో మూడు సింహాలు వచ్చి అక్కడ కూర్చున్నాయి. DCF నుంచి అందిన సమాచారం ప్రకారం.. దసరా రోజున యజ్ఞం జరుగుతుండగా మూడు సింహాలు అటుగా వెళ్తున్నాయి. మంత్రాల జపం విని.. అవి యజ్ఞ కుండం దగ్గరకు వచ్చి కూర్చున్నాయి.
యజ్ఞం కొనసాగుతున్నంత సమయం సింహాలు నిర్భయంగా ఉన్నాయి. యజ్ఞం చేస్తున్న బ్రాహ్మణులు భయం లేకుండా తమ పనిని కొనసాగించారు. యజ్ఞం పూర్తయిన వెంటనే.. సింహాలు లేచి నిలబడి అడవిలోకి వెళ్ళిపోయాయి. సింహాలు దైవిక శక్తి అయిన అమ్మవారిని పూజించడానికి ఆలయానికి చేరుకున్నట్లు అనిపించింది. ఒక వ్యక్తి ఈ సంఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఇప్పుడు వేగంగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియో చూసి ప్రజలు రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
కొంతమంది వైరల్ వీడియోను భక్తి మరియు శక్తి యొక్క ప్రత్యేక కలయిక అని పిలుస్తుండగా.. మరికొందరు తల్లి ఖోడియార్ ఆశీర్వాదంతో సింహాలు కూడా శాంతింగా ఉన్నాయని అంటున్నారు. అయితే, చాలా మంది వన్యప్రాణుల సంరక్షణ నియమాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..