Viral Video: ఇటాలియన్స్ పెళ్లి ఫంక్షన్ .. కాలా చష్మా సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వధూ, వరుల కుటుంబ సభ్యులు

|

Jun 21, 2024 | 6:19 PM

విదేశీయులు కూడా మన బాలీవుడ్ పాటలను ఎంతగానో ఇష్టపడతారన్న విషయం మనందరికీ తెలుసు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో మన పాటలు ప్లే అవుతూ సందడి చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో కూడా ఓ వీడియో ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇందులో ఇటాలియన్ వధూ, వరుల కుటుంబ సభ్యులు సంగీత్ ఫంక్షన్ లో స్పెషల్ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. సరళంగా చెప్పాలంటే.. ఈ వీడియో చూస్తే మనోహరమైన చిరునవ్వును మిగిల్చే క్షణాలలో ఇది ఒకటిగా నిలుస్తుంది.

Viral Video: ఇటాలియన్స్ పెళ్లి ఫంక్షన్ .. కాలా చష్మా సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వధూ, వరుల కుటుంబ సభ్యులు
Wedding Song Viral
Image Credit source: X
Follow us on

సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు రోజుకోకటి దర్శనమిస్తున్నాయి. ఇవి ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. తమ సంతోషాన్ని ఇతరులకు తెలియజేసేందుకు వాటిని ప్రజలు ఒకరితో ఒకరు పంచుకుంటారు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న పెళ్ళికి సంబంధించిన వీడియో వెరీ వెరీ స్పెషల్ .. ఎందుకంటే ఈ వీడియోలో సంగీత్ ఫంక్షన్‌ని ప్రత్యేకంగా రూపొందించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన తర్వాత మీరు కూడా చాలా సంతోష పడతారు. ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు.

విదేశీయులు కూడా మన బాలీవుడ్ పాటలను ఎంతగానో ఇష్టపడతారన్న విషయం మనందరికీ తెలుసు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో మన పాటలు ప్లే అవుతూ సందడి చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో కూడా ఓ వీడియో ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇందులో ఇటాలియన్ వధూ, వరుల కుటుంబ సభ్యులు సంగీత్ ఫంక్షన్ లో స్పెషల్ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. సరళంగా చెప్పాలంటే.. ఈ వీడియో చూస్తే మనోహరమైన చిరునవ్వును మిగిల్చే క్షణాలలో ఇది ఒకటిగా నిలుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వీడియోలో ఇటాలియన్ కుటుంబం భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరించి బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ కాలా చష్మాకు డ్యాన్స్ చేస్తున్నారు. ఆ ఫంక్షన్ లో ఉన్న అతిధులు డ్యాన్స్ చేస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నారు. అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్న వారి డ్యాన్స్ ను తమ తమ ఫోన్‌లలో రికార్డ్ చేస్తున్నారు. సాంగ్ కు తగిన విధంగా స్టెప్పులు వేస్తూ ఓ రేంజ్ లో పెళ్లి ఫంక్షన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. చూసిన ఎవరైనా వీరి డ్యాన్స్ ను మెచ్చుకోకుండా ఉండలేరు.

ఈ వీడియోను టొరంటోకు చెందిన వెడ్డింగ్ కొరియోగ్రఫీ కంపెనీ నాచాండ్‌కో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పటికే 40 వేల మందికి పైగా లైక్ చేయగా రకరకాలుగా కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అంతేకాదు డ్యాన్స్ చేస్తున్న వీరి స్టామినాను ప్రశంసిస్తున్నారు. వీరు సాంగ్ భాషని కూడా అర్థం చేసుకోలేరు.. అయినా సరే పాటను పూర్తిగా ఆనందిస్తున్నారు. వీరు భారతీయులు కాదు.. అయితే వీరి సరదా, ఉత్సాహం భారతీయుల కంటే ఏ మాత్రం తక్కువ కాదు అని మరొకరు కామెంట్ చేయగా.. చాలా మంది ఇతర వినియోగదారులు దీనిపై వ్యాఖ్యానించడం ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..