Viral Video: ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు దాగి ఉన్నాయి. శాస్త్రవేత్తలు కూడా ఇప్పటి వరకు ఛేదించని ఎన్నో చిత్రాలు, విచిత్రాలు ప్రకృతిలో దాగున్నాయి. ముఖ్యంగా ప్రకృతి సృష్టించిన జీవులు, వాటి లక్షణాలు చూస్తే ఒకొక్కసారి షాక్ తింటాం. సృష్టిలో అనేక జీవులు, రాకరకాల సైజుల్లో ఉన్నాయి. కొన్ని చాలా చిన్నవిగా ఉంటాయి. మరికొన్ని రంగును మార్చగల సామర్థ్యం ఉన్న జీవులు ఉన్నాయి. అయితే ఈ ప్రపంచంలో తనను తాను మార్చుకునే శక్తి ఉన్న ఒక జీవి కూడా ఉందని మీకు తెలుసా. ఈ జీవి గొంగళి పురుగు.. ఇది తనను ప్రాణాపాయం ఉంది అని తెలిస్తే.. ఎదుటివారిని బెదిరించడానికి పాముగా మారుతుంది.
హీమెరోప్లేన్స్ ట్రిప్టోలెమస్ గురించి మాట్లాడుతున్నాం.. ఇది తాను ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించిన వెంటనే పాములా మారుతుంది. తన దగ్గరకు ఎవరూ రాకుండా భయపెట్టి పారిపోయేలా చేస్తుంది. ఈ జీవి హెమెరోప్లేన్స్ చిమ్మట, స్పింగిడే కుటుంబానికి చెందినది. ఈ జీవి దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మధ్య అమెరికాలోని అనేక ప్రాంతాలలో కనిపిస్తుంది. అయితే మనకు కనిపించే పాము నోటి భాగం ఈ గొంగళి పురుగు నోరు కాదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎల్లప్పుడూ కొమ్మకు అతుక్కుపోయి ఉంటుంది. ప్రమాదం అనిపిస్తే.. తన నోటి ముందు భాగాన్ని చూపించి బెదిరించి అక్కడ నుండి పారిపోతుంది.
ఈ గొంగళి పురుగు తన వీపును పెంచి వజ్రాకారంలో పాము తలలా మార్చుకుంటుంది. ఈ సమయంలో దాని కళ్ళు పాములా కనిపిస్తాయి. తనను వేటాడే జంతువులను భయపెట్టడానికి పాములా తన కదలికను చాలాసార్లు మారుస్తుంది.
This caterpillar, Hemeroplanes triptolemus
When disturbed, it draws in air through holes known as sphiracles inflating its diamond shaped snakes ‘head’ which is actually the underside, complete with eye spots and even light reflections
?Andreas Kay https://t.co/uB1bNTGeag pic.twitter.com/FLiL42y1cj
— Science girl (@gunsnrosesgirl3) June 27, 2022
మీ సమాచారం కోసం ఇది పాములా కనిపించినప్పటికీ విషపూరితం కాదు. ఎందుకంటే ఇందులో విషం ఉండదు. దూకుడుగా కనిపించే ఈ జీవి తనను వేటాడేందుకు చుట్టూ వచ్చే పక్షులను భయపెట్టడానికి పాము రూపాన్ని తీసుకుంటుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..