
జపాన్ వినూత్న సాంకేతికతలో ముందంజలో ఉంటుంది. ప్రపంచంలో ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా అందిరి చూపు జపాన్ వైపే చూస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వీడియో చర్చగా మారింది. ఓ చక్కని గాడ్జెట్ ఇప్పుడు అందరి దృష్టినిక ఆకర్షిస్తోంది. జపాన్-నిర్మిత భవిష్యత్ పాదరక్షల సాంకేతికతను ఈ వీడియో చూపిస్తుంది. వైరల్ వీడియోను చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఇది నిజం కావాలని కోరుకుంటున్నారు. ఈ వీడియో ఏఐ సృష్టే అని అనుమానిస్తున్నప్పటికీ భవిష్యత్తులో నిజం అయితే బాగుండు అని కామెంట్స్ పెడుతున్నారు.
Instagram, X మరియు TikTokతో సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా ఈ వీడియో షేర్ అవుతోంది. వీడియలో ఒక వ్యక్తి తన పాదాన్ని స్కాన్ చేసి తక్షణమే సరిగ్గా సరిపోయే ట్రైనర్‌ను ఉత్పత్తి చేసే స్వీయ-సైజింగ్ స్నీకర్ పాడ్‌ను చూపిస్తుంది.
Japan unveils a new “self-sizing sneaker pod” they claim will change buying shoes forever.
Quite the feat. pic.twitter.com/JmFNEnTGNW
— Michael Berry (@MichaelBerrySho) December 1, 2025
వైరల్ వీడియోపై నెటిజన్స్ స్పందిస్తున్నారు. “ఇంజనీరింగ్ యొక్క నిజమైన ఘనత. భవిష్యత్తులో ఇది సాధ్యమవుతుంది” అని ఒక వినియోగదారు వీడియోపై వ్యాఖ్యానిస్తూ రాశారు. “ఈ సాంకేతికత బూట్లు కొనడాన్ని శాశ్వతంగా మారుస్తుంది. ఆ అల్లిక అతని పాదాన్ని బాగా పట్టుకుంది.” అని మరొక నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు.
కానీ వీడియోలో ఎటువంటి బ్రాండ్ లేదా స్పెసిఫికేషన్ గురించి ప్రస్తావించలేదు, ఆన్‌లైన్ వినియోగదారులు దాని ప్రామాణికతను ప్రశ్నించవలసి వచ్చింది, “AI కొత్త సాధారణంలా కనిపిస్తోంది” అని అన్నారు. మరొక వినియోగదారు “ఇది నిజంగానేనా?” అని అడిగారు.