Viral Video: విశాల్‌ పాటకు భారత మహిళా క్రికెటర్లు డ్యాన్స్.. అదిరిందమ్మాయిలు అంటున్న నెటిజన్లు..

|

Feb 03, 2023 | 1:44 PM

ఫిబ్రవరి 2న ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు జెమిమా రోడ్రిగ్స్‌ సహా దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, ఇతర క్రికెటర్లు తమ డాన్స్‌తో అలరించారు. ఈ వీడియోను ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. '

Viral Video: విశాల్‌ పాటకు భారత మహిళా క్రికెటర్లు డ్యాన్స్.. అదిరిందమ్మాయిలు అంటున్న నెటిజన్లు..
Viral Video
Follow us on

టీమిండియా మహిళా క్రికెటర్లు అద్భుతమైన డాన్స్‌తో అలరించారు. హీరో విశాల్‌ నటించిన ‘ఎనిమి’ సినిమాలోని ‘టమ్‌ టమ్‌’ పాట​కు అదిరిపోయే స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్‌లో ఉన్న టీమిండియా మహిళా బృందం టి20 ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా నిర్వహించిన టి20 ట్రై సిరీస్‌లో ఆడుతుంది. కాగా ఫిబ్రవరి 2న ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు జెమిమా రోడ్రిగ్స్‌ సహా దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, ఇతర క్రికెటర్లు తమ డాన్స్‌తో అలరించారు. ఈ వీడియోను ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ‘స్లేయింగ్‌ ది ట్రెండ్‌’ అంటూ క్యాప్షన్‌ జత చేసింది.

ఇక ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవ్వగా.. ముక్కోణపు టోర్నీ విజేతగా ఆతిథ్య దక్షిణాఫ్రికా నిలిచింది. ఫైనల్లో టీమిండియాను సఫారీ బృందం 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులే చేయగలిగింది. అనంతరం దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో 5 వికెట్లకు 113 పరుగులు చేసి విజయాన్నందుకుంది. భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచింది. కాగా ఫిబ్రవరి 10నుంచి దక్షిణాఫ్రికా గడ్డపైనే మహిళల టి20 వరల్డ్‌ కప్‌ జరగనుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..