నోరూరించే స్పైసీ గ్రీన్‌ పీస్‌.. ఎలా తయారు చేస్తారో తెలుసా..? ఆ ఆకుపచ్చ రంగు ఎలా వచ్చిందబ్బా..

|

Jun 17, 2023 | 12:37 PM

బఠానీలు ఆకుపచ్చ రంగులో ఎందుకుంటాయని ఎప్పుడూ ఆలోచించారా..? సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో పచ్చి బఠానీలను ఉప్పువేసి ఎలా తయారు చేస్తారో చక్కగా చూపించారు. వైరల్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో ఒక వ్యక్తి బఠానీలు సాల్టెడ్‌ గ్రీన్‌ మ్యాటర్‌ తయారు చేస్తున్నాడు. ఆ తర్వాత బఠానీలు ఆకుపచ్చగా మారుతాయి. ఈ వీడియోను..

నోరూరించే స్పైసీ గ్రీన్‌ పీస్‌.. ఎలా తయారు చేస్తారో తెలుసా..? ఆ ఆకుపచ్చ రంగు ఎలా వచ్చిందబ్బా..
Salted Green Matar F
Follow us on

మీరు కూడా స్పైసీ స్పైసీ గ్రీన్ పీస్ అంటే ఇష్టంగా తింటున్నారా..? అయితే, ఆ బఠానీలు ఆకుపచ్చ రంగులో ఎందుకుంటాయని ఎప్పుడూ ఆలోచించారా..? సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో పచ్చి బఠానీలను ఉప్పువేసి ఎలా తయారు చేస్తారో చక్కగా చూపించారు. వైరల్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో ఒక వ్యక్తి బఠానీలు సాల్టెడ్‌ గ్రీన్‌ మ్యాటర్‌ తయారు చేస్తున్నాడు. ఆ తర్వాత బఠానీలు ఆకుపచ్చగా మారుతాయి. ఈ వీడియోను ఫుడ్ బ్లాగర్ ‘సలోని బోత్రా’ @_heresmyfood జూన్ 12న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు – 120 కిలోల సాల్టెడ్ పచ్చి బఠానీలను తయారు చేయడం అనే శీర్షికతో ఈ వీడియోను షేర్‌ చేశారు.

ఇక సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోకి ఇప్పటికే 12.7 మిలియన్ (1 కోటి కంటే ఎక్కువ) వ్యూస్‌ వచ్చాయి. 1 లక్షా 87 వేల మందికి పైగా లైక్‌ చేశారు. అలాగే, 4 వేల మందికి పైగా వీడియోపై స్పందించారు. ఈ బఠానీలు సహజంగానే ఆకుపచ్చగా ఉంటాయని నేను భావించానంటూ ఒక వినియోగదారు రాశారు. ఇంతకీ ఆకుపచ్చ బఠానీలు ఎలా తయారు చేశాడో ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి

ముందుగా అతడు పెద్ద మొత్తంలో పచ్చి బఠానీలను తీసుకున్నాడు. వాటిని ఒక పెద్ద నీటి తొట్టిలో వేసి కడిగాడు. ఆ తర్వాత బఠానీలపై ఆకుపచ్చ రంగు చల్లి బాగా కలిపేశాడు. బఠానీలన్నింటికి రంగు బాగా పట్టిన తర్వాత వాటిని ఎండలో ఆరబెట్టాడు. ఆ తర్వాత తీసి నూనెలో డీప్‌ ఫ్రై చేశాడు. ఆ తర్వాత దానికి బాగా ఉప్పు పట్టించాడు. మరోమారు దానికి కొద్ది మొత్తంలో నూనె పట్టించి మళ్లీ ఆరబెట్టాడు. బాగా ఆరిన తర్వాత ఆ బఠానీలను ప్యాక్‌ చేస్తారని తెలిసింది. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయం చెప్పండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం  క్లిక్ చేయండి..