Video Viral: వరుడు చేసిన పనికి ఊరంతా షాక్.. పెళ్లి మండపానికి ఏకంగా 51 ట్రాక్టర్‏లతో..

ఇక పెళ్లిళ్లలో వధూవరులు చేసే చిన్న చిన్న అల్లరి పనులు చూసి వివాహనికి వచ్చిన అతిథులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. వివాహంలో ఆకస్మాత్తుగా జరిగే

Video Viral: వరుడు చేసిన పనికి ఊరంతా షాక్.. పెళ్లి మండపానికి ఏకంగా 51 ట్రాక్టర్‏లతో..
Viral

Updated on: Jun 15, 2022 | 12:15 PM

ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని చూడముచ్చటగా కనిపిస్తాయి.. అలాగే మరికొన్ని నవ్వులు పూయిస్తాయి. ఇక పెళ్లిళ్లలో వధూవరులు చేసే చిన్న చిన్న అల్లరి పనులు చూసి వివాహనికి వచ్చిన అతిథులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. వివాహంలో ఆకస్మాత్తుగా జరిగే సంఘటనలు నవ్వూలు పూయిస్తాయి. ఇక ఇటీవల నూతన వధూవరులు ట్రెండ్ మార్చారు.. రోటిన్‏గా కాకుండా సరికొత్తగా మండపానికి ఎంట్రీ ఇస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఓ పెళ్లికూతురు బుల్లెట్ బండిపై మండపానికి చేరుకోగా.. ఓసారి గుర్రంపై, సైకిల్ పై పెళ్లికొడుకులు మండపానికి చేరుకుని అందరిని ఆశ్చర్యపరిచారు.. ఇలాంటి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. కానీ తాజాగా ఓ వరుడు పెళ్లి మండపానికి ఎంట్రీ ఇచ్చిన తీరుకు అక్కడున్నవారంతా షాకయ్యారు.. అతని రాకను చూసి … అతని ఆలోచన చూసి నోరెళ్లబెట్టారు.. ఇంతకీ ఆ వరుడు ఏం చేశాడు అని అనుకుంటున్నారా ? అయితే అసలు విషయం తెలుసుకోవాల్సిందే.

ఓ అబ్బాయి తన పెళ్లి కోసం సరికొత్తగా ఆలోచించాడు.. వివాహ వేదిక వద్దకు రోటిన్ గా కాకుండా కాస్త స్పెషల్ గా రావాలనుకున్నాడు.. ఇంకెముంది.. తాను అనుకున్న పనికి శ్రీకారం చుట్టాడు.. తన పెళ్లి రోజు మండపానికి చేరుకోవడానికి ఏకంగా 51 ట్రాక్టర్లను ఏర్పాటు చేశాడు.. ఆ ట్రాక్టర్లలో తన బంధుమిత్రులందరినీ తీసుకుని ఊరేగింపుగా మండపానికి చేరుకున్నాడు.. ఒకదాని వెనక మరొకటి దారి పొడవున 51 ట్రాక్టర్ల నిండా జనాలతో ఊరేగింపుగా వస్తున్న వారిని చూసి అక్కడున్నవారంత ఆశ్చర్యపోయారు.. ఈ ఘటన రాజస్తాన్ లోని బార్మర్ జిల్లాలో జరిగింది. సెవినియాలా నుంచి బోర్వా గ్రామానికి దాదాపు 1 కిలోమీటరు పొడవునా 51 ట్రాక్టర్లలో 150 మంది అతిథులతో కలిసి మండపానికి చేరుకున్నాడు వరుడు.. మరో విశేషం ఏంటంటే.. అందులో ఒక ట్రాక్టర్ ను స్వయంగా వరుడు డ్రైవ్ చేస్తూ వచ్చాడు.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. అతను పెట్రోల్ పంప్ యాజమాని కావచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.