Viral Video: సిగ్గు సిగ్గు.. జలపాతం దగ్గర చెత్త వేస్తున్న భారతీయులు.. ఆ చెత్తని తీస్తున్న విదేశీ పర్యాటకుడు..

హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక విదేశీ పర్యాటకుడు జలపాతం దగ్గర చెల్లాచెదురుగా ఉన్న చెత్తను ఏరాడు. తద్వారా భారతీయులకు పరిశుభ్రతపై పాఠం నేర్పాడు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో ప్రజలు భారతీయ పర్యాటకుల పరిశుభ్రతను గురించి ప్రశ్నిస్తున్నారు.

Viral Video: సిగ్గు సిగ్గు.. జలపాతం దగ్గర చెత్త వేస్తున్న భారతీయులు.. ఆ చెత్తని తీస్తున్న విదేశీ పర్యాటకుడు..
Viral Video

Updated on: Jul 24, 2025 | 4:49 PM

ప్రజలు ఎత్తైన పర్వతాలను, జలపాతాలను సందర్శించాలని.. అంబరాన్ని తాకుతున్నట్లుగా కనిపించే అందమైన దృశ్యాలను చూడాలనుకుంటారు. అయితే ప్రకృతి అందాన్ని ఇష్టపడేవారు ఆ ప్రకృతి అందమైన ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటి నేచర్ ఎక్కువగా భారతీయులకు ఉంటుందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు కామెంట్ చేస్తూ ఉంటారు. భారతదేశం లో అపరి శుభ్రమైన ప్రదేశాలు మురికి ప్రదేశాలు ఉన్నాయని తరచుగా కామెంట్ చేస్తూ ఉంటారు. స్వచ్ భారత్ అంటారు..ఇంటిని శుభ్రం చేసిన మురికి తమ వీధిలో వేస్తారు ఇదే నేచర్ ఎక్కువగా భారతీయులకు ఉంటుందని ఫన్నీగా కామెంట్ చేసేవారు కూడా ఉన్నారు. అయితే మన దేశాన్ని సందర్శించడానికి వచ్చిన విదేశీయులు మన దేశంలో ఉన్న మురికిని చూపిస్తే… దానిని జీర్ణించుకోలేము.

కొంతమంది కొంచెం కూడా సమాజం పట్ల బాధ్యత లేనట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. అందమైన జలపాతాలు, నది ఒడ్డున, సముద్ర తీరం ఇలా ఎక్కడబడితే అక్కడ చెత్తని వేస్తూ అక్కడ గందరగోళం సృష్టిస్తారు. ఒకవేళ ఆ సమయంలో అక్కడ ఎవరున్నా ఆ చెత్తని శుభ్రం చేయరు.. చేయమని కూడా చెప్పరు. మనకెందుకు ఇది పబ్లిక్ ప్లేస్ కదా.. ఎవరు ఎలా ఉంటే మనకు ఎందుకు అనుకుని తమ పనిని తాము చేసుకుని వెళ్ళిపోతారు. అంతేకానీ అక్కడ ఉన్న చెత్తని మాత్రం తీసే ప్రయత్నం చేయరు. సమాజంలో మార్పు ప్రతి ఒక్కరికీ కావాలి.. కానీ ఆ మార్పు తన నుంచి మాత్రం ఎందుకు మొదలు కాకూడదు అనుకోరు. అయితే ఒక విదేశీయుడు జలపాతం దగ్గర ఉన్న చెత్తని శుభ్రం చేశాడు.

ఇవి కూడా చదవండి

ఒక విదేశీయుడు సహజ ప్రదేశాలలో చెత్త వేయడం ఎంత సిగ్గుచేటు పనో అని భారతీయ పర్యాటకులకు చూపించాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలోని ఒక అందమైన జలపాతం దగ్గర ఒక విదేశీ పర్యాటకుడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పర్యాటకుడు జలపాతం దగ్గర ఉన్న ప్లాస్టిక్, చెత్తను తీసుకొని చెత్తబుట్టలో వేస్తున్నట్లు కనిపిస్తుంది.

ఈ విదేశీయుడిని చూసి అందరూ సోషల్ మీడియాలో ఆయనను ప్రశంసిస్తున్నారు. ఈ పని ఇక్కడి వారే చేయాలని.. కానీ ఒక విదేశీయుడు చేస్తున్నాడని చాలా మంది అంటున్నారు. ఒక పర్యాటకుడు, ‘నేను ప్రతిరోజూ ఇక్కడ కూర్చుని చెత్తను ఎత్తి శుభ్రంగా ఉంచమని ప్రజలకు చెబుతాను’ అని అంటున్నాడు.

 

వీడియోను నిఖిల్ సైని @iNikhilsaini అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో 1.2 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఒక విదేశీ పర్యాటకుడు ఇక్కడ శుభ్రం చేస్తుంటే.. సొంత ప్రజలు మురికిని చల్లుతున్నారని చెప్పడం సిగ్గుచేటు. మనకు పరిశుభ్రమైన దేశం కావాలంటే… ప్రజలు తమ అలవాట్లను మార్చుకోవాలి’ అని ఒకరు కామెంట్ చేశారు. ఇదేనా పౌర స్పృహ అంటూ ప్రజలు చేసే పనిని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోపై చాలా మంది తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఇది మన మనస్తత్వానికి సంబంధించిన సమస్య. ప్రజలు ఈ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచడం ప్రభుత్వ పని అని భావిస్తారు.. అయితే ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత కూడా.’

‘మనం మన పిల్లలను చెత్త బయట వేయమని కూడా చెబుతాం.. చిన్నప్పటి నుండే పరిశుభ్రత అలవాటును అలవర్చుకునేలా చేయాలని ఒకరు సూచించారు. మన ఆలోచనను మార్చుకోకపోతే, దేశాన్ని శుభ్రంగా ఉంచలేము’ అని మరోకరు కామెంట్ చేశారు.

 

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..