ఫుట్‌బాల్ ఫ్యాన్స్ అంతే మరి.. అంత్యక్రియలు ఆపేసి మరీ మ్యాచ్‌ను చూసిన ఫ్యామిలీ.. వీడియో వైరల్

|

Jul 03, 2024 | 3:32 PM

పుట్ బాల్ ఆటను ఇష్టపడతారో తెలియజేస్తూ తాజాగా జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా నిలిచింది. ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ ఫ్యామిలీలో ముఖ్యమైన కుటుంబ సభ్యుడు మరణించాడు. దీంతో అంత్యక్రియల కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఆ ఇంట్లో అంత్యక్రియల పనులు నిలిచిపోయాయి. అందరూ కుర్చీలలో కూర్చున్నారు. ఎందుకంటే ఒక పెద్ద తెరపై ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రసారం అవుతుంది. దీంతో మృతదేహానికి చేయాల్సిన అంత్యక్రియలను పక్కకు పెట్టి.. కుటుంబం మొత్తం ఫుట్ బాల్ మ్యాచ్ ను చూడడంలో లీనమైంది.

ఫుట్‌బాల్ ఫ్యాన్స్ అంతే మరి.. అంత్యక్రియలు ఆపేసి మరీ మ్యాచ్‌ను చూసిన ఫ్యామిలీ.. వీడియో వైరల్
Family Watches Football Match In Middle Of Funeral
Image Credit source: Twitter
Follow us on

మన దేశంలో క్రికెట్ ను ఎంతగా ఇష్టపడతారో.. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఫుట్ బాల క్రీడను అంతగా ఇష్టపడతారు. సాకర్ ఫీవర్ కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ ప్రియులు తమ పనులను పక్కకు పెట్టి మరీ టివీ సెట్ల ముందు కూర్చుంటారు. ఎంతగా పుట్ బాల్ ఆటను ఇష్టపడతారో తెలియజేస్తూ తాజాగా జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా నిలిచింది. ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ ఫ్యామిలీలో ముఖ్యమైన కుటుంబ సభ్యుడు మరణించాడు. దీంతో అంత్యక్రియల కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఆ ఇంట్లో అంత్యక్రియల పనులు నిలిచిపోయాయి. అందరూ కుర్చీలలో కూర్చున్నారు. ఎందుకంటే ఒక పెద్ద తెరపై ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రసారం అవుతుంది. దీంతో మృతదేహానికి చేయాల్సిన అంత్యక్రియలను పక్కకు పెట్టి.. కుటుంబం మొత్తం ఫుట్ బాల్ మ్యాచ్ ను చూడడంలో లీనమైంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి మిశ్రమ స్పందన వస్తోంది.

ఈ ఘటన దక్షిణ అమెరికాలో జరిగింది. చిలీ, పెరూ మధ్య కోపా అమెరికా ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతోంది. మరో వైపు కుటుంబంలో సంతాప కార్యక్రమం కొనసాగుతోంది. శవపేటికలో మృతదేహాన్ని ఉంచారు. ఇటువంటి సమయంలో టివీలో హై వోల్టేజ్ మ్యాచ్ ప్రసారం అవుతుంది. శవ పేటికను పెట్టిన గదిలో భారీ ప్రొజెక్టర్ స్క్రీన్‌పై మ్యాచ్‌ ప్రసారం మొదలైంది. దీంతో ఎక్కడి పనులు అక్కడే పెట్టి.. కుటుంబ సభ్యులు, అతిథులు అందరూ కలిసి చిలీ జెర్సీలు ధరించి మ్యాచ్‌ను వీక్షించారు. ఈ సమయంలో శవపేటిక పైన పూల గుత్తితో పాటు చిలీ జెర్సీని కూడా ఉంచారు.

ఇవి కూడా చదవండి

ప్రార్థన గదిలో పెద్ద స్క్రీన్‌పై ఆట

కాగా, ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. కుటుంబీకుల నిర్ణయంతో ఒకవైపు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు “మరణించిన వ్యక్తి ఫుట్‌బాల్ అభిమాని అయి ఉండవచ్చు” అని మరికొందరు కామెంట్ చేశారు. అంతిమ యాత్ర సమయంలో కుటుంబసభ్యులు మరణించిన వ్యక్తుల ఇష్టాన్ని ప్రేమని గౌరవించారు. అతనితో కలిసి చివరి మ్యాచ్‌ని చూశారని ఒకరు కామెంట్ చేయగా.. ‘మ్యాచ్ స్కోర్ చూసి లేచి కూర్చోకపోతే చచ్చినట్టు లెక్క’ అని మరొకరు ఫన్నీ కామెంట్ చేశారు.

 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..