Viral Video: రోడ్డుపై దృశ్యాన్ని చూసి నిలిచిపోయిన వాహనాలు… పెర్త్‌లో ఆసక్తికర సంఘటన వైరల్
రోడ్డుపై భారీగా వాహనాలు దూసుకుపోతున్నాయి. ఇంతలో రోడ్డుపైకి రెండు బాతులు పిల్లలతో పాటు వచ్చాయి. వాటిని చూడగానే వేగంగా దూసుకెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. రోడ్డుకు ఇరువైపులా ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయాయి. రోడ్డు దాటేంత వరకూ వాహనదారులు ముందుకు వెళ్లలేదు...

రోడ్డుపై భారీగా వాహనాలు దూసుకుపోతున్నాయి. ఇంతలో రోడ్డుపైకి రెండు బాతులు పిల్లలతో పాటు వచ్చాయి. వాటిని చూడగానే వేగంగా దూసుకెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. రోడ్డుకు ఇరువైపులా ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయాయి. రోడ్డు దాటేంత వరకూ వాహనదారులు ముందుకు వెళ్లలేదు. ఈ ఆసక్తికర సంఘటన పెర్త్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కోమోలోని కానింగ్ హైవేపై వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నాయి. ఇంతలో ఓ బాతుల గుంపు రోడ్డుపైకి వచ్చింది. ఇది గమనించిన కొందరు వాహనదారులు తమ వాహనాలను ఒక్కసారిగా ఆపేశారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇంతలో ఆ బాతుల గుంపు ఎంచక్కా ఒకదాని వెనుక నడుస్తూ రోడ్డు దాటేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న కొందరు తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. కాగా, వాహనాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో పలు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరు కార్లు దెబ్బతిన్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వాహనదారులు ప్రవర్తించిన తీరును పశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో చూడండి:
DUCKS ON FREEWAY – KWINANA FREEWAY NORTHBOUND AT CANNING HIGHWAY, COMO Multiple lanes affected Motorist out of vehicles Motorists be aware and be alert Traffic heavy back to Leach Highwayhttps://t.co/9PVfGLIBPN#perthtraffic #mainroadswa pic.twitter.com/A3RrRNI3FB
— Main Roads WA (@Perth_Traffic) October 10, 2025
