Video: అందమైన అమ్మాయి తనతో ఫొటో దిగుతుంటే.. ఈ ఏనుగు పిల్ల చూడండి ఏం చేసిందో!

మూడేళ్ల ఏనుగు పిల్ల ఒక అందమైన అమ్మాయిని ఏం చేసిందో చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్యూట్‌ దృశ్యం లక్షలాది మందిని ఆకట్టుకుంది. జంతువులకు మానవులతో ఏర్పడే బంధాన్ని ఈ వీడియో చక్కగా చూపుతుంది. ఏనుగు ఎంతో క్యూట్గా అందమైన అమ్మాయిని..

Video: అందమైన అమ్మాయి తనతో ఫొటో దిగుతుంటే.. ఈ ఏనుగు పిల్ల చూడండి ఏం చేసిందో!
Baby Elephant

Updated on: Jul 13, 2025 | 9:47 PM

జంతువులకు మానవులతో భావోద్వేగ బంధం ఉంటుంది. వాటిని ఎక్కువగా ప్రేమించే వారిని అవి కూడా బేషరతుగా ప్రేమిస్తాయి. తాజాగా థాయిలాండ్‌లోని ఎలిఫెంట్ పార్క్ లో కూడా అలాంటి ఓ సంఘటన చోటు చేసుకుంది. బటూల్ అనే మహిళ పార్కును సందర్శిస్తుండగా ఒక పిల్ల ఏనుగు ఆమె చెంపపై ముద్దు పెట్టింది. అది కూడా రెండు సార్లు. ఈ క్యూట్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

draroobabatool అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోలో.. “ఊహించని ముద్దు. నేను హలో చెప్పడానికి వెళ్ళాను. కానీ, నేను ప్రతిగా ముద్దును ఆశించలేదు. ఈ మరియాన్ పేరు అమేలియా, ఆమెకు మూడేళ్ల వయస్సు” క్యాప్షన్‌లో పేర్కొన్నారు యూజర్‌. అందులో, థాయ్ పార్కును సందర్శించిన బతుల్, మూడేళ్ల అమేలియా మరియాన్ పక్కన నిలబడి ఉన్నట్లు చూడవచ్చు. తర్వాత అమేలియా తన తొండం ఎత్తి ఆ మహిళ చెంపపై ముద్దు పెట్టుకుంది.

ఈ వీడియో నాలుగు మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది, వినియోగదారులు ఇలా అంటున్నారు, “ఈ దృశ్యం చూడటానికి నిజంగా చాలా అందంగా ఉంది, ముద్దుగుమ్మ.” మరొకరు, “నేను ఇప్పటివరకు చూసిన అత్యంత హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో ఇది.” మరొకరు, “నేను ఈ వీడియోను నాలుగు నుండి ఐదు సార్లు చూశాను” అని వ్యాఖ్యానించారు. మరికొందరు హృదయ చిహ్నాలను పంపడం ద్వారా తమ ప్రశంసలను వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి