గర్భధారణ సమయంలో స్త్రీలకు రకరకాల కోరికలు ఉంటాయని మీరు వినే ఉంటారు. కొందరికి పులుపు ఆహారం తినాలని కోరుకుంటే.. మరి కొందరికి తీపి ఆహారం తినాలని కోరుకుంటారు. అలా దుబాయ్‌కి చెందిన ఓ గర్భిణీ మహిళకు ఓ వస్తువు తినాలని కోరిక కల్గియింది. అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఉత్తమమైన ఆహారం దొరుకుతుందని అది తనకు తినాలని ఉందని తన భర్తకు చెప్పింది. అయితే ఎక్కడ దుబాయ్.. ఎక్కడ అమెరికా అంటూ ఆ భర్త సహజంగానే షాక్ అయి ఉంటాడని ఆలోచిస్తే .. ఆ ఆలోచన తప్పే.. ఎందుకంటే ఆ వ్యక్తి తన భార్య కోరికను కూడా తీర్చాడు. 8000 మైళ్ల (సుమారు 13 వేల కి.మీ) దూరం ప్రయాణించి.. గర్భిణీ అయిన తన భార్య కోరిన ఆహారాన్ని అందించాడు.
కాలిఫోర్నియాలోని అనాహైమ్‌కి చెందిన లిండా ఆండ్రేడ్ అనే యువతి తన భర్తతో కలిసి దుబాయ్‌లో నివసిస్తోంది. ఇటీవల ఆమె టిక్‌టాక్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. ఈ మొత్తం సంఘటన గురించి తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. అది విని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ గర్భవతి లిండా మిలియనీర్ రికీ భార్య. ఈమె తన సంపదని సోషల్ మీడియాలో తరచుగా ప్రదర్శిస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంది.
24 ఏళ్ల లిండా గర్భవతి.. తొమ్మిదవ నెల. ప్రసవించే సమయం కూడా దగ్గర పడుతోంది. అయితే లిండాకు జపనీస్ A5 వాగ్యు , కేవియర్ తినాలనిపించింది. అదే విషయాన్నీ తన భర్తకు చెప్పింది. అంతేకాదు లాస్ వెగాస్‌లో అత్యుత్తమ జపనీస్ వాగ్యు ఉంటుందని తన భర్త రికీకి చెప్పి.. లాస్ వెగాస్ నుంచి తీసుకుని రమ్మనమని కోరింది.
వైరల్ అయిన క్లిప్‌లో లిండా తన మిలియనీర్ భర్త రికీతో కలిసి జపనీస్ ఫుడ్ ని తింటూ కనిపించింది. ఈ వంటకం ధర పౌండ్‌కు 250 డాలర్లు (సుమారు 21 వేల రూపాయలు) అని లిండా చెప్పింది.
గత సంవత్సరం లిండా ఒక వారంలో 3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 25 కోట్లు) ఖర్చు చేసింది. రికీ క్రిప్టో ట్రేడింగ్ ద్వారా అదృష్టం కలిసి వచ్చి ఇప్పుడు లక్షాధికారి అయ్యాడు. రికీ ఒకప్పుడు డిష్‌వాషర్ టెక్నీషియన్ అని గర్భవతి లిండా స్వయంగా చెప్పింది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..