
మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతిరోజు కొన్ని వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నవ్వు తెప్పిస్తుంటాయి. వాటిలో కొన్ని భయానకంగా, మరికొన్ని పూర్తిగా హాస్యాస్పదంగా ఉంటాయి. ఇక జంతువులు, వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తాజాగా చక్కర్లు కొడుతోంది. ఒక కుక్క ఏకంగా చిరుత పులినే తరిమేసిన వీడియో అది. ఆ వీడియోను చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
చిరుత పులి అంటేనే జంతువులైనా, మనుషులైన భయపడుతుంటారు. ఇక చిరుత అక్కడి నుంచి వెళుతుందంటే కుక్కలు ఇక్కడి నుంచే జారుకుంటాయి. చిరుతలంటే కుక్కలకు అంత భయం. అలాంటి ఈ వీడియోలో మాత్రం ఓ కుక్క చిరుతను భయపెట్టి పరుగులు పెట్టిస్తుంది.
ఈ వైరల్ వీడియోలో ఒక చిరుతపులి దొంగతనంగా ఓ ఇంట్లోకి ప్రవేశించడం కనిపిస్తుంది. అది ఆహారం కోసమో లేక ఆశ్రయం కోసమో చప్పుడు చేయకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తూ మెట్లు ఎక్కడం ప్రారంభిస్తుంది. అంతా ప్రశాంతంగా ఉంది అని చిరుత అనుకునేలోపే ఓ కుక్క అకస్మాత్తుగా తన డెన్ నుంచి బయటకు దూకి, భయంకరంగా మొరుగుతుంది. దీంతో చిరుత పులి బతుకు జీవుడా అన్నట్టు ఒక్క ఉదుటున పరుగులు పెట్టింది.
ఈ హఠాత్పారిణామం నెటిజన్స్‌కు కూడా నవ్వు తెప్పిస్తుంది. కుక్క డేర్‌నెస్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. ఈ కుక్కలకు ఏదైనా శౌర్య పతకం లాంటిది ఇచ్చేది ఉంటే అది దీనికి ఇవ్వాలంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిరుత పులి ప్రాణభయంతో ఉరుకింది చూడు అలాంటి సీన్ మళ్లీ చూడలేం అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఈ కుక్కతో ఆత్మరక్షణ ట్రైనింగ్ ఇప్పించాలని మరికొందరు చమత్కరించారు.