Viral Video: వర్షాకాలంలో ఇగో ఇట్లా మింగుతై జాగ్రత్త!.. ఓపెన్‌ డ్రెయినేజీలో పడిన దివ్యాంగుడు వీడియో వైరల్‌

సలే ఇది వర్షాకాలం, మ్యాన్‌హోళ్లు నోళ్లు తెరుచుకుని ఆవురావుమనే కాలం. ఎక్కడ ఏ గుంత ఉందో, ఎప్పుడు ఏ రోడ్డు కుంగుతుందో తెలియని పరిస్థితి. అప్రమత్తంగా లేకుంటే అమాంతంగ మింగేస్తాయి. గతంలో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని...

Viral Video: వర్షాకాలంలో ఇగో ఇట్లా మింగుతై జాగ్రత్త!.. ఓపెన్‌ డ్రెయినేజీలో పడిన దివ్యాంగుడు వీడియో వైరల్‌
Disabled Man Falls Into Ope

Updated on: Aug 29, 2025 | 5:01 PM

అసలే ఇది వర్షాకాలం, మ్యాన్‌హోళ్లు నోళ్లు తెరుచుకుని ఆవురావుమనే కాలం. ఎక్కడ ఏ గుంత ఉందో, ఎప్పుడు ఏ రోడ్డు కుంగుతుందో తెలియని పరిస్థితి. అప్రమత్తంగా లేకుంటే అమాంతంగ మింగేస్తాయి. గతంలో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని ఢిల్లీ అతలాకుతలం అవుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. డ్రెయినేజీలు పొంగి పొర్లుతున్నాయి. గురువారం కాస్త వర్షం తెరిపినివ్వడంతో ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ఈ క్రమలోఓ దివ్యాంగుడు ప్రమాదవశాత్తు స్కూటర్‌తో సహా డ్రైయినేజీలో పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది.

స్కూటర్‌ రివర్స్‌ చేస్తుండగా అదుపుతప్పి డ్రైయినేజీలో పడిపోయాడు దివ్యాంగుడు. ఆ మురుగు కాలువ లోతు ఉంది. పైగా దాని నిండా నీళ్లు ఉన్నాయి. అందులో పడిపోయిన ఆ వ్యక్తి పైకి రావడం కష్టంగా మారింది. చివరకు స్థానికుల సహాయంతో ప్రాణాలతో పైకి రాగలిగాడు. ఈ సంఘటన గురువారం ఇందిరాపురంలో జరిగింది. సంతోష్‌ యాదవ్‌ అనే దివ్యాంగుడు ఖోడా సుభాష్ పార్క్ ప్రాంతంలో నివసిస్తుంటాడు. అయితే తన పిల్లలకు బర్గర్లు కొనేందుకు బయటికి వచ్చాడు. వైభవ్ ఖండ్‌లోని గౌర్ గ్రీన్ సొసైటీలోని షాప్‌లో బర్గర్లు కొన్నాడు. స్కూటర్‌ ఆన్‌ చేసి రివర్స్‌ చేశాడు. ఈ క్రమలో అదుపు తప్పి అక్కడ తెరిచి ఉన్న మురుగు కాలువలో స్కూటర్‌తో సహా పడిపోయాడు.

వీడియో చూడండి:

ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు కొందరు హుటాహుటిన స్పందించారు. కర్ర నిచ్చెనను మురుగు కాలువలో ఉన్న బాధితుడికి అందించి పైకి రప్పించారు. దివ్యాంగుడైన సంతోష్‌ ఈ సంఘటనలో స్వల్పంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. క్లీనింగ్‌ కోసం తెరిచిన ఆ డ్రెయినేజీపై తిరిగి ర్యాంప్‌ నిర్మించకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.