Viral Video: ఈ వీడియో చూస్తే మనసు ఉప్పొంగుతుంది.. పెళ్లిలో ఆహారం వృధా కాకుండా సరికొత్త ప్లాన్..

|

Feb 19, 2024 | 9:35 AM

పెళ్లిళ్లకు వెళ్లాలంటే అందరికీ ఇష్టమే. అతిథులు రకరకాల దుస్తులను ధరిస్తారు. డ్యాన్స్ చేస్తారు. ఆటపాటలతో సందడి చేస్తారు. స్నేహితులు, బంధువులు ఒకరినొకరు కలుసుకుని ఆత్మీయతతో పలకరించుకుంటారు. బఫే డిన్నర్ ఏర్పాట్లతో అతిథులు తమకు నచ్చిన ఆహారాన్ని ఇష్టానుసారం ఆహారం తింటారు. తద్వారా ఇలాంటి పెళ్లిల్లో చాలా ఆహారం వృధా అవుతుంది.

Viral Video: ఈ వీడియో చూస్తే మనసు ఉప్పొంగుతుంది.. పెళ్లిలో ఆహారం వృధా కాకుండా సరికొత్త ప్లాన్..
Viral Video
Follow us on

ప్రస్తుతం ప్రతి ఒక్కరు తమ వివాహాన్ని ప్రత్యేకంగా చేసుకోవాలని రకరకాల పనులు చేస్తుంటారు. ఇందుకోసం కొందరు డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకుంటే, మరికొందరు పెళ్లిలో ప్రత్యేకమైన, అద్భుతమైన ఏర్పాట్లతో ప్రజల హృదయాలను గెలుచుకుంటారు. అంతే కాకుండా డబ్బును నీళ్లలా ఖర్చు చేసే పెళ్లిళ్లు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఏర్పాట్లలో ఒకటి రకరకాల ఆహారపదార్ధాలతో ఏర్పాటు చేసే విందు. దీంతో ఆహారం  చాలా వృధా అవుతుంది. తాజాగా అలాంటి పెళ్లి వీడియో ఒకటి జనాల్లో చర్చనీయాంశమైంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ప్రతి పెళ్లిలో ఇలాంటి వ్యవస్థ ఉండాలని అంటారు.

పెళ్లిళ్లకు వెళ్లాలంటే అందరికీ ఇష్టమే. అతిథులు రకరకాల దుస్తులను ధరిస్తారు. డ్యాన్స్ చేస్తారు. ఆటపాటలతో సందడి చేస్తారు. స్నేహితులు, బంధువులు ఒకరినొకరు కలుసుకుని ఆత్మీయతతో పలకరించుకుంటారు. బఫే డిన్నర్ ఏర్పాట్లతో అతిథులు తమకు నచ్చిన ఆహారాన్ని ఇష్టానుసారం ఆహారం తింటారు. తద్వారా ఇలాంటి పెళ్లిల్లో చాలా ఆహారం వృధా అవుతుంది. అయితే ఒక పెళ్లిలో అతిధులు తిని వదిలేసిన ఆహారాననికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇలాంటి పధ్ధతి ప్రతి పెళ్లిలో  అమలైతే కొంచెం తిండి కూడా వృథా కాదు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వీడియోలో అతిథులు ఆహారం తిన్న తర్వాత.. డస్ట్ బిన్ దగ్గరకు వస్తున్నారు. ఒక వ్యక్తి మిగిలిపోయిన ఆహారంతో ప్లేట్‌ను డస్ట్ బిన్ టబ్‌లోపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి అతన్ని ఆపి.. కొంచెం ముందు ఉన్న స్టాల్ వైపు చూపాడు. టేబుల్‌పై చాలా డబ్బాలు ఉన్నాయి. ఆ డబ్బాలపై వివిధ రకాల వంటకాల పేర్లు రాసి ఉన్నాయి. ప్లేస్ లో మిగిల్చిన ఆహారాన్ని పేర్లకు అనుగుణంగా ఆయా డబ్బాల్లో వెయ్యాలి. మిగిలిన ఆహారాన్ని అలా వేసిన అనంతరం అక్కడ ఉన్న టబ్ లో ప్లేట్ ను పెట్టాడు. అప్పుడు అతనికి ఎదురుగా ఉన్న మరొకరు ఒక పువ్వుని అందించాడు.

ఈ వీడియో instaలో arey_tubaa అనే ఖాతాలో షేర్ చేశారు. ఈ వార్త రాసే వరకు రెండు లక్షల మందికి పైగా లైక్ చేయగా, కోట్లాది మంది ఈ వీడియోను వీక్షించారు. రకరకాల కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒకరు ‘ప్రతి పెళ్లిలో ప్రజలు ఇలా ఆహారాన్ని పొదుపు చేస్తే, ఎంతో మంది పేదలకు ఆహారం అందించవచ్చు. మరొకరు ‘ఈ వ్యవస్థ అద్భుతమైనది. ప్రతి వివాహంలో ఇలాంటి సిస్టమ్ ని అమలు చేయాలి.’ అంతేకాదు చాలా మంది ఈ వీడియోపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..