Viral Video: కొంతమంది వృద్ధులు తమకున్న దానితో సంతోషముగా సరదాగా జీవిస్తూ.. నలుగురికి ఆనందాన్ని పంచుతారు. వయసుతోపనిలేదు.. ఎంజాయ్ చేయడానికి మనసు ఉంటె చాలు అంటూ తమ నేచర్ తో పదిమందికి చిరునవ్వుని పంచుతారు. తాజాగా విదేశీ యువకుడు డ్యాన్స్ చేస్తుంటే అతనికి తాత జతకలిసి చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకర్షించింది. వివరాల్లోకి వెళ్తే..
భారతీయ వీధిలో ఒక విదేశీ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్నాడు. అప్పుడు ఒక వృద్ధుడు అతనితో జతకట్టి.. తనదైన శైలిలో ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ఒక విదేశీయుడు బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ కు డ్యాన్స్ చేస్తుంటే.. అతని చుట్టును జనం చేరి ఆసక్తిగా చూస్తున్నారు. సల్మాన్ ఖాన్-కాజోల్ చిత్రం ప్యార్ కియాతో డర్నా క్యా లోని ఓ ఓ జానే జానా సాంగ్ కు డ్యాన్స్ చేస్తున్నాడు.. అప్పుడు ఓ తాత ఆ విదేశీ యువకుడితో జతకలిశారు. ఆ తాతగారు సాంగ్ ని విదేశీవ్యక్తి డ్యాన్స్ ని ఆస్వాదిస్తూ.. తనదైన శైలిలో స్టెప్పులు వేశాడు.
ఈ వీడియోను కొద్ది రోజుల క్రితం ‘సుధీర్ దండోటియా ‘ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో కి పలువురు నెటిజన్లు ఫిదా ‘దాదాజీ’ అద్భుతమైన డ్యాన్స్ అంటూ కొందరు.. మరికొందరు.. ఇది నా భారత దేశం మా తాతగారు అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంతోషం వ్యక్తం చేయడానికి ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయడానికి వయసుతో పనిలేదు తాతగారు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు .
देशी के अंदाज के आगे विदेशी भी फीका @nitinjrnlist @SuYuting8 @Naveen_K_Singh_ pic.twitter.com/HGdzn8SjIY
— sudhirdandotiya (@sudhirdandotiya) November 19, 2021
Also Read:
ఖర్జూరం తిని గింజలు పడేస్తున్నారా.. అయితే ఖర్జూరం విత్తనాలు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా..