Viral Video: భారతదేశంలో పెళ్లంటే ఓ పండుగనే. ప్రతీ జంట తమ పెళ్లి వేడుకను సర్వాంగసుందరంగా, కనివిని ఎరుగని రీతిలో, వినూత్నంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తారు. సామాన్యులు మొదలు, ధనవంతుల వరకు తమ తమ స్థాయిలో డిఫరెంట్ స్టైల్‌లో వివాహ వేడుక కోసం ప్లాన్స్ వేసుకుంటారు. ఇక కొంచెం డబ్బు ఉంటే.. ఈవెంట్ ఆర్గనైజర్ల సాయంతో వివాహ వేడుకలను నిర్వహిస్తారు. భిన్నమైన విధానాలతో, ప్లాన్స్‌తో ఈ ఈవెంట్ మేనేజర్లు వివాహ వేడుకలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వధువరులను పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుగా తీర్చిదిద్దేది మొదలు.. పెళ్లి వేదికపై ఎంట్రీ, రిసెప్షన్ ఎంట్రీ, డ్రెస్సింగ్, అన్నింటికీ ప్రత్యేకంగానే రూపకల్పన చేస్తారు. గాల్లో ఊయల ఏర్పాటు చేయడం, రథాల్లో తీసుకురావడం, పల్లికిలో వధువును తీసుకురావడం వంటివి చేస్తారు.
ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన ఒక జంట కూడా తమ వివాహానికి అంతే స్థాయిలో ప్లాన్స్ వేసుకున్నారు. వేసుకోవడం ఏంటి.. ఆచరణలో కూడా పెట్టారు. అయితే, ఎక్కడ పొరపాటు జరిగిందో గానీ.. ఆ పొరపాటు కారణంగా వధువరులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఓవైపు వేదిక చుట్టూ బాణసంచా కాలుస్తుండగా.. మరోవైపు డ్యాన్సర్స్ డ్యాన్స్ చేస్తున్నారు. జేసీబీ తొట్టిని ఊయలగా ఏర్పాటు చేసి.. అందులో వధువరులిద్దరినీ కూర్చొబెట్టి తీసుకువచ్చారు. చూడటానికి వారి ఎంట్రీ అదిరిపోయింది. కానీ, ఏం జరిగిందో తెలియదు కానీ, జేసీబీ తొట్టి ఒక్కసారిగా తిరగబడింది. దాంతో వధువరులిద్దరూ గబాలున కిందపడిపోయారు. అది చూసిన బంధువులు హతాశులయ్యారు. దాదాపు 12 అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఇదిలాఉంటే.. 30 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయ్యో పాపం.. అంటూ సానుభూతి తెలుపుతున్నారు.
Viral Video:
When the JCB guy had to wait 20 mins for the Tandoori Butter roti and when the basket finally arrive it was looted enroute by the pointy shoes wearing ladke waale pic.twitter.com/N2fNEl2fdb
— Gabbbar (@GabbbarSingh) November 29, 2021
Also read:
TV9 Digital News Round Up : సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న టాప్ 9 ట్రెండింగ్ న్యూస్.. (వీడియో)
Miss Universe 2021: మరోసారి భారత్‌కు మిస్ యూనివర్స్ కిరీటం..