కొండ నుంచి కింద పడిన కారు.. మరణాన్ని తృటిలో తప్పించుకున్న డ్రైవర్.. షాకింగ్ వీడియో వైరల్

శిక్షణ పొందిన డ్రైవర్లు కూడా ప్రమాద బాధితులుగా మారిన సంఘటనల గురించి తరచుగా వింటూనే ఉన్నాం. కనుక కొండ వంటి ప్రాంతాల్లో ఎంత డ్రైవింగ్ వచ్చిన వారైనా సరే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక కారు కొండ ప్రాంతంలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. వీడియోలో కనిపిస్తున్న ఈ దృశ్యం చాలా షాకింగ్‌గా ఉంది.

కొండ నుంచి కింద పడిన కారు.. మరణాన్ని తృటిలో తప్పించుకున్న డ్రైవర్.. షాకింగ్ వీడియో వైరల్
Shocking Video

Updated on: Jun 04, 2024 | 11:15 AM

కొండ మీద ఉన్న ఘాట్ రోడ్లపై డ్రైవింగ్ చేయడం అంత సులభం కాదు. ఇందులో చాలా ప్రమాదం ఉంది. ముఖ్యంగా కొత్తగా డ్రైవింగ్ మొదలు పెడితే.. పొరపాటున కూడా కొండ ప్రాంతాలలో డ్రైవ్ చేయవద్దు. ఎందుకంటే డ్రైవింగ్ చేసే సమయంలో చేసే చిన్న పొరపాటు కూడా ప్రాణాలను బలిగొంటుంది. అయితే శిక్షణ పొందిన డ్రైవర్లు కూడా ప్రమాద బాధితులుగా మారిన సంఘటనల గురించి తరచుగా వింటూనే ఉన్నాం. కనుక కొండ వంటి ప్రాంతాల్లో ఎంత డ్రైవింగ్ వచ్చిన వారైనా సరే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక కారు కొండ ప్రాంతంలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. వీడియోలో కనిపిస్తున్న ఈ దృశ్యం చాలా షాకింగ్‌గా ఉంది.

ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కలిసి కారును కింద పడకుండా కొండ వాలుపై పైకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అలా యువకులు కారుని నెడుతున్న సమయంలో ఒక డ్రైవర్ కారు లోపల ఉన్నాడు. అయితే అకస్మాత్తుగా కారు బ్యాలెన్స్ తప్పింది. ఆ తర్వాత కారుని నెట్టుతున్న వ్యక్తులు త్వర త్వరగా పక్కకు తప్పుకున్నారు. అప్పుడు కారు వెంటనే వెనుకకు వెళ్లడం మొదలైంది. ఆ తర్వాత వెంటనే డ్రైవర్ కారు నుంచి కిందకు దూకాడు. కారు జారి కింద ఉన్న లోతైన గుంటలో పడిపోతుంది. ఈ షాకింగ్ ఘటన జమ్మూకశ్మీర్‌లో జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

ప్రమాదానికి సంబంధించిన వీడియోను చూడండి

ఈ హృదయ విదారక ప్రమాద వీడియో ప్రతీక్ 34381357 అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 15 సెకన్ల ఈ వీడియో ఇప్పటివరకు 52 వేల మందికి పైగా వీక్షించారు. వందలాది మంది వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఒకరు డ్రైవర్ అదృష్టవంతుడు కనుక బతికాడు అని కామెంట్ చేస్తే.. అతడు తన అదృష్టానికి పోగిపోవాల్సిందే..అని అంటే మరొకరు జీవితకాలపు రోడ్డుపన్ను కూడా ఇప్పుడు గుంతలో పడింది’ అని మరోకరు వ్యాఖ్యానించారు. తమ్ముడు అదృష్టవంతుడు రక్షించబడ్డాడు.. లేకపోతే అతను కూడా కారుతో పాటు లోతైన లోయలోకి వెళ్లి ఉండేవాడు’ అంటూ రకరకాల కామెంట్స్ చేశారు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..