Viral Video: రోడ్డుపై 15 సార్లు పల్టీ కొట్టిన కారు… ప్రయాణికులు ఎగిరిపడుతున్న దృశ్యాలు వైరల్

ప్రస్తుత కాలంలో ఇంటి నుంచి బయటికి పోయిన మనుషులు మళ్లీ క్షేమంగా తిరిగి వస్తారనే నమ్మకం ఉండదు. బయట ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. అలాంటిదే కర్ణాటకలో జరిగిన ఓ యాక్సిడెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అది అలాంటి ఇలాంటి ప్రమాదం కాదు మరి. ఓ కారు రోడ్డు మీద ఏకంగా 15 సార్లు..

Viral Video: రోడ్డుపై 15 సార్లు పల్టీ కొట్టిన కారు... ప్రయాణికులు ఎగిరిపడుతున్న దృశ్యాలు వైరల్
Car Flips Multiple Times

Updated on: Apr 03, 2025 | 6:00 PM

ప్రస్తుత కాలంలో ఇంటి నుంచి బయటికి పోయిన మనుషులు మళ్లీ క్షేమంగా తిరిగి వస్తారనే నమ్మకం ఉండదు. బయట ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. అలాంటిదే కర్ణాటకలో జరిగిన ఓ యాక్సిడెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అది అలాంటి ఇలాంటి ప్రమాదం కాదు మరి. ఓ కారు రోడ్డు మీద ఏకంగా 15 సార్లు పల్టీ కొట్టింది మరి. అందుకే ఆ యాక్సిడెంట్‌ నెట్టింట అంత వైరల్‌గా మారింది. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి.

వీడియోలో ఉన్న విజువల్స్‌ ప్రకారం వేగంగా వెళ్తున్న కారు తొలుత డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత 15 సార్లు పల్టీలు కొట్టిడం కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఆ వాహనం నుంచి గాల్లోకి ఎగిరిపడటం కూడా విజువల్స్‌లో చూడొచ్చు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. ఈ భయంకర ప్రమాదం వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాకు చెందిన ఒక కుటుంబం బెంగళూరు నుంచి సొంతూరుకు కారులో బయలుదేరారు. చిత్రదుర్గ జిల్లాలోని జాతీయ రహదారి 150లో ఆ కారు అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొంది. కారు అప్పటికే యమ స్పీడ్‌లో ఉండటంతో డివైడర్‌ దాటి పక్కనున్న లేన్‌పై 15 సార్లు పల్టీలు కొట్టింది. ఆ కారులో ఉన్న వారిలో ఒక వ్యక్తి గాల్లోకి ఎగిరిపడటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

కారును డ్రైవ్‌ చేసిన మౌలా అబ్దుల్, ఆయన ఇద్దరు కుమారులు ఈ ప్రమాదంలో మరణించినట్లు సమాచారం. గాయపడిన మిగతా కుటుంబ సభ్యులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో చూడండి: