Viral Video: డీజె ఎఫెక్ట్‌.. స్టేజ్‌పైనే డ్యాన్స్ చేసిన పెళ్లికూతురు.. బిత్తరపోయిన పెళ్లికొడుకు..!

Viral Video: వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేకం. అందుకే ఆ రోజుని ప్రతి ఒక్కరు గుర్తుంచుకునే విధంగా జరుపుకుంటారు. అయితే పెళ్లిళ్లలో చాలా వింతైన

Viral Video: డీజె ఎఫెక్ట్‌.. స్టేజ్‌పైనే డ్యాన్స్ చేసిన పెళ్లికూతురు.. బిత్తరపోయిన పెళ్లికొడుకు..!
Bride Dance

Updated on: Apr 10, 2022 | 4:53 PM

Viral Video: వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేకం. అందుకే ఆ రోజుని ప్రతి ఒక్కరు గుర్తుంచుకునే విధంగా జరుపుకుంటారు. అయితే పెళ్లిళ్లలో చాలా వింతైన సంఘటనలు జరుగుతాయి. చాలామంది పాటలు పాడటం, డ్యాన్స్‌ చేయడం, కానుకలు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సార్లు వధూ వరులు డ్యాన్స్‌తో అందరిని అలరిస్తారు. ఇలాంటి వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లు వీటిని బాగా ఆదరిస్తారు. లైక్స్‌, కామెంట్స్‌తో హుషారెత్తిస్తారు. తాజాగా వివాహానికి సంబంధించిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంతకీ అందులో ఏం జరిగిందో తెలుసుకుందాం.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో స్టేజ్‌ పై వధూవరులిద్దరు మొదటగా బంధువులని పలకరించడం మనం చూడవచ్చు. అయితే వరుడు అతడి స్నేహితుడితో ముచ్చటిస్తుండగా వధువు ఓ కొంటె పనిచేస్తుంది. డీజేలో ఆమెకి ఇష్టమైన పాట రావడంతో మెల్లగా డ్యాన్స్‌ చేయడం వీడియోలో గమనించవచ్చు. కొంతసేపటికి స్టేజ్‌ కిందినుంచి ఓ అబ్బాయి అదే పాటకి డ్యాన్స్‌ చేయడం కనిపిస్తుంది. సపోర్ట్‌ రావడంతో పెళ్లికూతురు మరింత రెచ్చిపోతుంది. డ్యాన్స్‌ ఇరగదీస్తుంది. ఇది మొత్తం గమనించిన వరుడు షాక్ అవుతాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

వైరల్‌ అవుతున్న వధువు డ్యాన్స్ వీడియోని ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘వెడ్డింగ్‌మినిస్ట్రీ’ అనే ఐడితో షేర్ చేశాడు. ఇది ఇప్పటివరకు 3 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది.  చాలా మంది లైక్ చేసారు. అదే విధంగా వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.

Solar Panels: కొత్త యుగం సోలార్ ప్యానెల్.. రాత్రిపూట కూడా విద్యుత్ ఉత్పత్తి..!

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న క్రేజ్‌.. అమ్మకాలలో ఈ కంపెనీ ఫస్ట్‌ ప్లేస్‌..!

Viral Photos: ఇతడొక విచిత్రమైన వ్యక్తి.. గ్రహాంతరవాసికేమి తీసిపోడు..!