పెళ్లి అంటేనే సంబంరం.. బంధుమిత్రులు అందరూ ఒకేచోట కనిపిస్తారు. సహపంక్తి భోజనాలు ఉంటారు. ఆనందంలో దుమ్ములేపే స్టెప్స్ వేయడానికి కూడా సరైన సమయం. ఒక్కటేమిటి.. ఎన్నో గోప్ప అనుభూతులకు పెళ్లి కేరాఫ్ అని చెప్పాలి. ఇప్పుడు పెళ్లి వేడుకలకు సంబంధించిన రకరకాల వైరల్ వీడియోస్ నెట్టింట సర్కులేట్ అవుతూ ఉన్నాయి. అందులో కొన్ని ఫన్నీ వీడియోస్ కాగా, మరికొన్ని ఎమోషనల్ వీడియోస్ ఉన్నాయి. ఇంకెన్ని క్యూట్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో క్రేజీ వీడియో బయటకు వచ్చింది. తాజాగా ఓ వదిన తన మరిది పెళ్లిలో ఆనందంతో డ్యాన్స్ చేసి.. నూతన వధూవరులతో పాటు పెళ్లికి వచ్చిన అతిథులను ఆశ్చర్యపరిచింది. సల్మాన్‌ఖాన్, మాధూరి దీక్షిత్ జంటగా నటించిన ‘హమ్ ఆప్‌కే హైకోన్’ మూవీలోని ‘లోచలీ మై అప్‌నీ దేవర్‌కి బరాత్ లేకే’ అనే సాంగ్ పెళ్లిలో.. ప్లే చేశారు. ఆ చిత్రంలో సల్మాన్‌ఖాన్ కోసం అతని.. వదిన ఈ పాటకు డ్యాన్స్ చేస్తోంది. అయితే, ఈ పెళ్లిలో కూడా ఒక మహిళ.. తన మరిది కోసం.. సూపర్ డ్యాన్స్ చేసింది.
పాటకు అనుగుణంగా ఆమె వేసిన స్టెప్పులు అక్కడ ఉన్నవారిని ఆకట్టుకున్నాయి. ఆమె చేస్తున్న డ్యాన్స్ చూసి.. కొత్త జంట ఫుల్ హ్యాపీ అయిపోయారు. పలువురు ఆమె డ్యాన్స్‌ను ఫోన్లలో రికార్డు చేశారు. ఈ పెళ్లి ఎక్కడ జరిగిందో వివరాలు లేదు కానీ.. వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘వావ్ డ్యాన్స్ అదుర్స్’.. ‘వేడుక అంటే సందడి ఇలా ఉండాలి’ అని కామెంట్లు పెడుతున్నారు.
Also Read: ధమాకా న్యూస్.. దీపావళి సందర్భంగా మహేశ్ ఫ్యామిలీకి గిఫ్ట్ పంపిన పవర్ స్టార్