Viral Video: కదులుతున్న కారుపై ముద్దులతో హద్దుమీరిన జంట… వీడియో వైరల్‌ కావడంతో రంగంలోకి పోలీసులు…

ఇటీవలి కాలంలో యువత హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. పబ్లిగ్గానే రొమాన్స్‌ చేస్తూ రెచ్చిపోతున్నారు. చుట్టుపక్కల ఉన్నవారికి న్యూసెన్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. పోలీసులు పట్టుకుని కేసులు పెట్టినా కూడా తమ ప్రవర్తన మార్చుకోవడం లేదు. బైక్‌, కారులో ప్రయాణిస్తూ ముద్దులతో హద్దులు మీరుతున్నారు. చుట్టూ ఉన్న జనం ఉన్నారనే...

Viral Video: కదులుతున్న కారుపై ముద్దులతో హద్దుమీరిన జంట... వీడియో వైరల్‌ కావడంతో రంగంలోకి పోలీసులు...
Couples On Moving Car

Updated on: May 30, 2025 | 3:14 PM

ఇటీవలి కాలంలో యువత హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. పబ్లిగ్గానే రొమాన్స్‌ చేస్తూ రెచ్చిపోతున్నారు. చుట్టుపక్కల ఉన్నవారికి న్యూసెన్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. పోలీసులు పట్టుకుని కేసులు పెట్టినా కూడా తమ ప్రవర్తన మార్చుకోవడం లేదు. బైక్‌, కారులో ప్రయాణిస్తూ ముద్దులతో హద్దులు మీరుతున్నారు. చుట్టూ ఉన్న జనం ఉన్నారనే పట్టింపు లేదు. నడిరోడ్డుపై పబ్లిక్‌గానే రొమాన్స్‌ చేయం ఈ మధ్య ఫ్యాషన్‌ అయిపోయింది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు రోజుకు ఎక్కడో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తారిది రాష్ట్రాల్లో సోషల్‌ మీడియా మోజు కోసం చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. ఇటీవలి కాలంలో ఆ జాడ్యం దక్షిణాది రాష్ట్రాలకు కూడా పాకింది.

తాజాగా ఓ జంట రోడ్లపై రాత్రిపూట అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. కదులుతున్న కారు సన్‌రూఫ్‌ నుంచి బయటకు వచ్చి హద్దులు మీరి ప్రవర్తించారు. ఈ ఘటన ట్రినిటీ రోడ్డులో మంగళవారం రాత్రి చోటు జరిగింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది.

వీడియో పోలీసుల వరకు చేరడంతో రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు. నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు ఆ జంటను పట్టుకున్నారు. వారికి రూ.1,500 ఫైన్‌ వేశారు. మరోసారి ఇలాగే వెకిలి చేష్టలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్లపై ప్రయాణించేటప్పుడు యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

వీడియో చూడండి: