Viral Video: సోషల్ మీడియాలో ప్రతి రోజూ వందలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో జంతువులకు సంబంధించిన వీడియోలైతే చాలా అందంగా ఉంటాయి. కొన్ని జంతువుల చేష్టలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని జంతువుల ప్రవర్తన అత్యంత భయానకంగా ఉంటుంది. ఈ విషయంలో ఏనుగులు అతీతమేమీ కాదు. ఏనుగులు ఎంత బీభత్సం సృష్టిస్తాయో.. అంతే ఉల్లాసాన్ని కూడా కలిగిస్తాయి. ముఖ్యంగా గున్న ఏనుగులు చూడముచ్చటగా ఉంటాయి. అవి చేసే అల్లరి ఉల్లాసంగా అనిపిస్తాయి. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. గున్న ఏనుగు చాలా అందంగా ఉందని, దాని అల్లరి సూపర్ అంటున్నారు.
ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. టూరిస్టులు సఫారీలో అడవి జంతువులను వీక్షిస్తున్నారు. జీప్‌లో కూర్చుకుని అలా అలా వెళ్తుండగా.. వారికి ఓ గున్న ఏనుగు తారసపడింది. సాధారణంగా అయితే, టూరిస్టులను ఏనుగులు గానీ, ఇతర అడవి జంతువులు గానీ ఏమీ అనవు. ఒకవేళ వాటికి కోపం వస్తే అటాక్ చేసేందుకు వస్తాయి. అప్పుడు టూరిస్టులు తప్పించుకుంటారు. అయితే, ఈ వీడియలో టూరిస్టులకు తారసపడ్డ గున్న ఏనుగుకు కూడా బాగా కోపం వచ్చిందో ఏమో మరి. మా అడ్డాకా వస్తావా? అంటూ అడ్డు తిరిగింది. టూరిస్టుల జీపు వద్దకు వచ్చింది వారిని బెదిరించే ప్రయత్నం చేసింది. జీప్ టైర్ హైట్ కూడా లేని ఆ గున్న ఏనుగు వారిని ‘భయపడతారా? భయపడరా?’ అన్నట్లు బెదిరించింది. టూరిస్టులు దాని ప్రవర్తన చూసి ఫుల్ ఖుషీ అయిపోయారు. బుల్లి ఏనుగు అల్లరిని ఫిదా అయిపోయారు. అయితే, కొందరు టూరిస్టులు ఈ చిన్న ఏనుగు అల్లరిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు మంత్రముగ్దులైపోతున్నారు. ఎంత క్యూట్‌గా ఉందో అంటూ మురిసిపోతున్నారు. తమదైన స్టైల్‌లో కామెంట్స్ పెడుతున్నారు. కొందరైతే.. సమంత పాట ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా’ పాటను మార్చేస్తూ.. ‘ఊ అంటావా టూరిస్ట్.. ఊఊ అంటావా టూరిస్ట్.’’ అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ బ్యూటీఫుల్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Also read:
Andhra Pradesh: కువైట్‌లో త్రిబుల్ మర్డర్స్.. ఉలిక్కిపడ్డ కడపజిల్లా.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!
Viral Video: ఈ తిమింగలం వెరీ స్పెషల్ గురూ.. అడిగి మరీ ముద్దు పెట్టించుకుంటుంది..!
Viral Video: యజమాని కోసం ఇంజనీర్‌గా మారిన కుక్క.. వైరల్ అవుతున్న అద్భుతమైన వీడియో..!