Viral Video: నంబర్ ప్లేట్ లేని బైక్‌పై ఎదురుగా కూర్చొని.. ఆంటీ పెట్టిన ముద్దు వైరల్..!

|

Jan 01, 2024 | 5:54 PM

ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీని గురించి వ్రాసిన ఒక వినియోగదారు.. ఆ రెండు బైకులపై ప్రయాణిస్తున్నవారు తమ పరిమితి దాటి ప్రవర్తించారంటూ మండిపడ్డారు. కాస్త వారి ఓవర్‌ యాక్షన్‌ తగ్గించుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా జరగరానిది జరిగితే.. వారితో పాటు ఆ రోడ్డుపై వచ్చే పోయే వాహనదారులు, ప్రయాణికులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు.

Viral Video: నంబర్ ప్లేట్ లేని బైక్‌పై ఎదురుగా కూర్చొని..  ఆంటీ పెట్టిన ముద్దు వైరల్..!
Auntys Flying Kiss
Follow us on

సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు దర్శనమిస్తున్నాయి. కొన్ని వీడియోలు మనల్ని నవ్విస్తాయి.. కొన్ని మనకు గుణపాఠం నేర్పుతాయి. మరికొన్ని వీడియోలు ప్రజల్ని ఆలోచించేలా చేస్తాయి. అంతేకాదు.. కొందరు రాత్రికి రాత్రే ఫేమస్ కావడానికి రకరకాల వీడియోలు చేస్తుంటారు. కొన్నిసార్లు అలాంటి వీడియోలను చిత్రీకరిస్తున్నప్పుడు ప్రజలు నిబంధనలను విస్మరిస్తారు. ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో కదులుతున్న బైక్‌పై వెళ్తున్న ఓ ఆంటీ బాటసారులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కదులుతున్న బైక్‌పై ఆంటీ ఫ్లయింగ్ కిస్ వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు.. వీడియోలో ముందుగా ఓ బైక్‌పై ఒక మహిళ కూర్చొని ఉంది. అయితే, ఆమె కూర్చున్న విధానం కూడా భిన్నంగానే ఉంది..నంబర్‌ ప్లేట్ లేని బైక్‌పై వెనుకకు కూర్చుని ఉంది. రోడ్డుకు ఎదురుగా బైక్‌పై కూర్చున్న మహిళ తన వెనుక వస్తున్న మరో బైకర్‌కు ఫ్లయింగ్ కిస్ ఇవ్వటం కనిపించింది. ఆమె యాక్షన్‌కు అవతలి వ్యక్తి కూడా మహిళ ఫ్లయింగ్ కిస్‌కి ఫ్లయింగ్ కిస్‌తో స్పందిస్తున్నాడు. సైగలు చేస్తూ.. ఆ వ్యక్తి తన బైక్‌పై కూర్చోమని మహిళను అడుగుతాడు. కానీ ఆ మహిళ దానిని సైగలతో కొట్టిపారేస్తుంది. అయితే, మహిళ కూర్చున్న బైక్‌కు నంబర్ ప్లేట్ లేకపోవడంతో పాటు మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్లిన మరో వ్యక్తి బైక్‌కు కూడా నంబర్ ప్లేట్ లేదు. ముగ్గురిలో ఎవరూ హెల్మెట్ ధరించకపోవడం కూడా ఇక్కడ గమనార్హం.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మహిళ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీని గురించి వ్రాసిన ఒక వినియోగదారు.. ఆ రెండు బైకులపై ప్రయాణిస్తున్నవారు తమ పరిమితి దాటి ప్రవర్తించారంటూ మండిపడ్డారు. కాస్త వారి ఓవర్‌ యాక్షన్‌ తగ్గించుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా జరగరానిది జరిగితే.. వారితో పాటు ఆ రోడ్డుపై వచ్చే పోయే వాహనదారులు, ప్రయాణికులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. ఆ వ్యక్తి వీడియోను బీహార్ పోలీసులకు, పాట్నా పోలీసులకు ట్యాగ్ చేశాడు.

దీనిపై మరో వినియోగదారు వ్యాఖ్యానిస్తూ…ఇక్కడ యువతి చేసిన పని.. ఒక అబ్బాయి చేస్తే మాత్రం..అతనిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యేవని, కానీ ఇక్కడ యువతి కావటంతో ఎలాంటి కేసులు ఉండవని అంటున్నారు. పోలీసులు ఆమెకు చలాన్ వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..