Viral Video: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. 24 బంతుల్లోనే 72 రన్స్‌.. బీస్ట్‌ మోడ్‌లో బౌలర్లను ఉతికారేసిన ఆల్‌రౌండర్‌..

Andre Russell: పొట్టి ఫార్మాట్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ విధ్వంసం కొనసాగుతోంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును..

Viral Video: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. 24 బంతుల్లోనే 72 రన్స్‌.. బీస్ట్‌ మోడ్‌లో బౌలర్లను ఉతికారేసిన ఆల్‌రౌండర్‌..
Andre Russell Smashes Six Sixes In 6ixty Tournament

Updated on: Aug 29, 2022 | 10:01 AM

Andre Russell: పొట్టి ఫార్మాట్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ విధ్వంసం కొనసాగుతోంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించిన ఈ కరేబియన్‌ క్రికెటర్‌ ఇప్పుడు 10 ఓవర్ల ఫార్మాట్లోనూ చెలరేగుతున్నాడు. వెస్టిండీస్ క్రికెట్‌ కొత్తగా ప్రవేశపెట్టిన సిక్స్‌టీ టోర్నీలో ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నాడు. ఈలీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తోన్న అతను తాజాగా సెయింట్‌ కిట్స్‌ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌ల్లో ఆరు బంతుల్లో వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు. మొత్తం 24 బంతుల్లో 72 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం 8 సిక్స్‌లు, 5 ఫోర్లు ఉండడం విశేషం. రస్సెల్‌ మెరుపు ఇన్నింగ్స్‌ చలవతో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ నిర్ణీత 10 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన సెయింట్ కిట్స్ 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రామే చేసింది. దీంతో ట్రినిడాడ్‌ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే రసెల్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోను తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేసింది ట్రిన్‌బాగో నైట్ రైడర్స్. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు ఇదేం మాస్‌ బ్యాటింగ్‌ రా సామీ.. బీస్ట్‌ మోడ్‌లో బౌలర్లను ఉతికి ఆరేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

Liger HD Stills And Posters: రౌడీ హీరో ఫ్యాన్స్ కి అలెర్ట్.. లైగర్ హెచ్ డి పోస్టర్స్ అండ్ స్టిల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..