Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘కోడిగుడ్డు’ వీడియో.. ఏకంగా 2.5 కోట్లకుపైగా వ్యూస్‌తో..

|

Dec 06, 2022 | 1:53 PM

Viral Video: గుడ్డును కొంత ఎత్తు నుంచి పడేస్తే ఏమవుతుంది? ఇంకేముంది పట్టుమని పగిలిపోతుంది. చిన్న పిల్లాడిని అడిగినా ఇదే సమాధానం చెబుతారు. మరి అదే గుడ్డును అంతరిక్షం నుంచి పడేస్తే..

Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘కోడిగుడ్డు’ వీడియో.. ఏకంగా 2.5 కోట్లకుపైగా వ్యూస్‌తో..
Egg In Space
Follow us on

గుడ్డును కొంత ఎత్తు నుంచి పడేస్తే ఏమవుతుంది? ఇంకేముంది పట్టుమని పగిలిపోతుంది. చిన్న పిల్లాడిని అడిగినా ఇదే సమాధానం చెబుతారు. మరి అదే గుడ్డును అంతరిక్షం నుంచి పడేస్తే.. అయినా పగులుతుందంటారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. అవును మరి.. అంతరిక్షం నుంచి గుడ్డును పడేసినా.. అది పగల్లేదు సరికదా కనీసం చిన్న గీత కూడా పడలేదు. ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఏకంగా ఈ వీడియోను 2.5 కోట్లకు పైగా వ్యూస్‌ సాధించింది. పది రోజుల్లోనే నెట్టింట్లో సంచలనం క్రియేట్ చేస్తోందీ వీడియో.

నాసా మాజీ ఇంజనీర్, ప్రముఖ యూట్యూబర్ మార్క్ రాబర్.. గుడ్డు ప్రయోగాన్ని అంతరిక్షానికి తీసుకెళ్లాడు. ఎత్తైన ప్రదేశం నుంచి గుడ్డును పడేసినా పగలకుండా ల్యాండ్ చేయడమే ఈ ప్రయోగం లక్ష్యం. అయితే, ముందుగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అయిన దుబాయ్‌లోని బూర్జ్‌ ఖలీఫా నుంచి గుడ్డును వదలాలని ప్లాన్స్ వేశాడు. కానీ, అంతలోనే తన మనసును మార్చుకుని అంతరిక్షం నుంచి గుడ్డును విసరాలని భావించాడు. ఇంకేముందు.. ఆ మేరకు ప్లాన్ చేశాడు.

ఈ వీడియోలో గుడ్డును ఏ విధంగా కిందకు విసురుతారు అనే పూర్తి వివరాలను పేర్కొన్నారు. ఆకాశంలోకి రాకెట్ సహాయంతో గుడ్డును తీసుకెళ్లి అక్కడి నుంచి దానిని కిందకు వదిలారు. రాకెట్ పడే చోట ఒక పరుపును ఏర్పాటు చేశారు. అయితే, అనేక ప్రయత్నాల తరువాత ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది. నాసా జింనీర్ అయిన ఆడమ్ స్టెల్జ్నర్ సహాయంతో గుడ్డు పగలకుండా సక్సెస్‌ఫుల్‌గా జారవిడిచారు. అంతరిక్షం నుంచి వదిలిన గుడ్డు.. నేలపై పడనే పడింది. అయితే, ఆ గుడ్డు క్షేమంగా, కనీసం ఎలాంటి గీతలు కూడా లేకుండా ల్యాండ్ అయ్యింది. ఆ గుడ్డును తీసుకుని ముద్దాడాడు. అయితే, ఈ వీడియోకు 10 రోజుల్లోనే 25 మిలియన్లకు పైతంగా వ్యూస్ వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..