AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నేరుగా మొక్కలతో ముచ్చట పెట్టొచ్చు…! డబ్లిన్లోని ట్రినిటి కాలేజ్ పరిశోధకుల విజయం

చిన్నప్పుడు సరదాగా చెట్టు వెనుక దాక్కుని దాంతో మాట్లాడటం వంటివి చేసేవాళ్లం. ఆ సరదా ఆ అల్లరే వేరు. కొందరు ప్రకృతి ప్రేమికులు చెట్లనే తమ ఆత్మీయులుగా భావించి వాటిని కౌగలించుకోవడం చూశాం. ఇప్పుడు పరిశోధకులు ఏకంగా చెట్టుతో నేరుగా మాట్లాడే సరికొత్త టెక్నాలజీని కనిపెట్టడమే కాదు...

Viral Video: నేరుగా మొక్కలతో ముచ్చట పెట్టొచ్చు...! డబ్లిన్లోని ట్రినిటి కాలేజ్ పరిశోధకుల విజయం
Talking Tree
K Sammaiah
|

Updated on: May 23, 2025 | 8:05 PM

Share

చిన్నప్పుడు సరదాగా చెట్టు వెనుక దాక్కుని దాంతో మాట్లాడటం వంటివి చేసేవాళ్లం. ఆ సరదా ఆ అల్లరే వేరు. కొందరు ప్రకృతి ప్రేమికులు చెట్లనే తమ ఆత్మీయులుగా భావించి వాటిని కౌగలించుకోవడం చూశాం. ఇప్పుడు పరిశోధకులు ఏకంగా చెట్టుతో నేరుగా మాట్లాడే సరికొత్త టెక్నాలజీని కనిపెట్టడమే కాదు.. చెట్లతో నేరుగా మాట్లాడే అవకాశాన్ని ఇస్తున్నారు. చెట్టుకు ప్రాణం ఉంది అది కూడా స్పందిస్తుందని తెలుసుకున్నాం. అది ఎంత వరకు నిజం అనేది కూడా ప్రయోగాత్మకంగా ప్రూవ్‌ చేశారు. అవి ఎలా తన పక్క చెట్లతో సంభాషిస్తుందో కూడా వివరించారు.

ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్ లోని ట్రినిటి కాలేజ్‌లో పరిశోధకులు టాకింగ్ ట్రీ టెక్నాలజీని అభివృద్ధి చేసారు. రెండు వందల ఏళ్ల నాటి లండన్ ప్లేన్‌ ట్రీతో మాట్లాడారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఏఐ సాంకేతికతతో చెట్టుకు స్వరాన్ని అందించారు. చెట్టు మనతో మాట్లాడటానికి వీలుగా పర్యావరణ సెన్సార్లు అమర్చారు. అంటే ఇక్కడ సెన్సార్లుగా నేల తేమ, నేల pH, గాలి ఉష్ణోగ్రత, సూర్యకాంతి, గాలి నాణ్యత ఆధారంగా ‘బయోఎలక్ట్రికల్ సిగ్నల్స్’ని చెట్టు తీసుకుంటుంది. ఆ సిగ్నల్స్‌ని ఏఐ సాంకేతికత .. మానవులకు అర్థమయ్యే భాషలా మారుస్తుంది.

ఈ ప్రాజెక్టు లక్ష్యం కేవలం ప్రకృతి ప్రయోజనార్థమే అని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రకృతితో మానవులు అనుసంధానమై ఉంటే..అకస్మాత్తుగా అంటుకునే కార్చిచ్చులను సకాలంలో నివారించడం సాధ్య పడుతుందని చెబుతున్నారు. చెట్టుతో ఎలా సంభాషించాలో వీడియో రూపంలో చూపించారు. అక్కడ ట్రినిటీ కాలేజ్లో దాదాపు 200 ఏళ్ల నాటి లండన్‌ ప్లేన్‌ ట్రీ వేర్లకు AI ట్రీ టెక్నాలజీని అనుసంధానించి మాట్లాడారు. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ఆ పురాతన చెట్టుతో ఏ విధంగా సంభాషిస్తున్నాడో స్పష్టంగా ఉంది.

వీడియో చూడండి:

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ