Viral Video: అదేంది బ్రో.. పట్టపగలే ఏసినట్టున్నవుగా… ఫన్నీ వీడియో వైరల్‌

సాధారణంగా యువకుడి బైక్‌ వెనకాల గర్ల్‌ఫ్రెండ్‌ కూర్చున్నదంటే పట్టపగ్గాలు ఉండయంటారు. కానీ ఇక్కడో వచిత్రమైన సంఘటన జరిగింది. అది కావాలని చేశాడా? లేక కాకతాళీయంగా జరిగిందా అనేది పక్కన పెడితే జరిగిన సంఘన మాత్రం నెటిజన్స్‌కు నవ్వు తెప్పిస్తుంది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ప్రతిరోజు...

Viral Video: అదేంది బ్రో.. పట్టపగలే ఏసినట్టున్నవుగా... ఫన్నీ వీడియో వైరల్‌
Husband Forgot Wife

Updated on: May 20, 2025 | 3:37 PM

సాధారణంగా యువకుడి బైక్‌ వెనకాల గర్ల్‌ఫ్రెండ్‌ కూర్చున్నదంటే పట్టపగ్గాలు ఉండయంటారు. కానీ ఇక్కడో వచిత్రమైన సంఘటన జరిగింది. అది కావాలని చేశాడా? లేక కాకతాళీయంగా జరిగిందా అనేది పక్కన పెడితే జరిగిన సంఘన మాత్రం నెటిజన్స్‌కు నవ్వు తెప్పిస్తుంది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ప్రతిరోజు సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆసక్తికరంగా ఉంటే మరికొన్ని మాత్రం ఫన్నీగా ఉండి నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి వీడియోనే ఇది.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ భర్త చేసిన పని నెటిజన్స్‌కు నవ్వు తెప్పిస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి బైక్ మీద ప్రయాణిస్తున్నాడు. తన భార్య వెనక కూర్చోగా, కొడుకు మధ్యలో కూర్చుండబెట్టుకుని బైక్ నడుపుకుంటూ వెళుతున్నాడు. ఇంతలో ఆ అనుకోని సంఘటన జరిగింది. ఎదురుగా ఓ ట్రక్కు రావడంతో అతడి బైకు అదుపుతప్పినట్లయింది. దీంతో బైక్‌ పక్కు వంగడంతో బైక్ వెనుక కూర్చున్న మహిళ తన ప్రమేయం లేకుండానే కిందకు జారిపోయింది. భార్య దిగిపోయినట్టు పట్టించుకోని ఆ వ్యక్తి అలాగే బైక్ నడుపుకుంటూ వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తుంది. ఆ ఘటనను అదే రోడ్డులో వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీయడంతో అది వైరల్‌గా మారింది.

ఆ ఫన్నీ వీడియోపై నెటిజన్స్‌ రకరకాలుగా కామెంట్స్‌ పెడుతున్నారు. అతడు ఆమె భార్యను కావాలనే వదిలేసి వెళ్లిపోయినట్టున్నాడు అని ఒకరు పోస్టు పెట్టగా, ఇంటికి వెళ్లాక ఆ భర్తకు ఉంటది చూడు అని మరొకరు కామెంట్స్‌ పెట్టారు. భార్యను వదిలించుకోవడానికి మంచి ట్రిక్ కనిపెట్టారని మరొకరు ఫన్నీగా పోస్టు పెట్టారు.

 

వీడియో చూడండి: