సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ కంటెంట్‌నే నెటిజన్లు కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా సింహం, మొసలి, పులి, చిరుత వంటి క్రూర మృగాల వేటకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిని చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు.
పాము పేరు వింటేనే మనందరికీ గుబులు పుడుతుంది. కాసేపు మనుషులు గురించి పక్కన పెడితే.. కొన్ని జంతువులు పాముతో పేచీ ఎందుకని దూరంగా ఉంటాయి. సాధారణంగా పాములు ఏవైనా చిన్న చిన్న కీటకాలు, పురుగులను ఆహారంగా తింటాయి. అయితే ఇక్కడ వీడియోలో ఓ పాము ఎలుకను ఆహారంగా చేసుకోవాలనుకుంది. కానీ సీన్ కాస్తా రివర్స్ అయింది.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ పెద్ద గాజు డబ్బాలో ఒక పెద్ద పామును మీరు చూడవచ్చు. దానికి ఆహారంగా ఓ తెల్ల ఎలుకను అందులోకి వేస్తారు. ఇక ఎలుకలు పాములకు ఇష్టమైన ఆహారం అని చెప్పొచ్చు. ఇంకేముంది క్షణాల్లో ఆ ఎలుక ప్రాణాలు పోయాయి అని అనుకోవచ్చు. కాని ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఆ పాము అస్సలు దానిని ఏం చేయలేదు. ఇంకా చెప్పాలంటే.. ఆ పాముపైకి ఎక్కి ఎలుక.. ఆ డబ్బా నుంచి బయటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఈ వీడియోను ‘royal_pythons’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిని చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.