Viral Video: జస్ట్‌ మిస్‌.. ఈ కింగ్ కోబ్రాను చూస్తేనే సుస్సు పడేలా ఉంది.. అలా ఎలా పట్టేశావ్ అన్న.. వీడియో వైరల్

Viral Video: స్నేక్ క్యాచర్ ఏ మాత్రం బెదిరిపోకుండా తన వద్ద ఉన్న గోనే సంచికి ఓ పైపు ముక్కను ముందువైపు తగిలించి దానిని కింగ్ కోబ్రా ముందు పెట్టాడు. స్నేక్‌ క్యాచర్‌ దానిని పట్టే విధానం చూస్తే వెన్నులో వణుకు పట్టాల్సిందే. దానిని చూసిన కింగ్ కోబ్రా తొలుత దానిలో..

Viral Video: జస్ట్‌ మిస్‌.. ఈ కింగ్ కోబ్రాను చూస్తేనే సుస్సు పడేలా ఉంది.. అలా ఎలా పట్టేశావ్ అన్న.. వీడియో వైరల్

Updated on: Aug 06, 2025 | 1:05 PM

పాముల జాతులలో అత్యంత ప్రమాదరం.. విషపూరితం ఏది అంటే కింగ్ కోబ్రా(King Cobra). అలాంటి కింగ్ కోబ్రాలలో కొన్ని జాతులు భారీ సైజులో చాల పొడవుగా పెరిగి మరింత ప్రమాదకరంగా కనిపిస్తుంటాయి. ఇవి కాటేసిందంటే చాలు మనిషి క్షణాల్లోనే చనిపోతాడు. అంతేకాదు భారీ జంతువులను సైతం సులభంగా మింగేయగలవు. కింగ్ కోబ్రాలలోని నాలుగు జాతులలో అంత్యంత డేంజర్ జాతి. నార్తర్న్ కింగ్ కోబ్రా. దీని శాస్త్రీయ నామం ఓఫియో ఫేగస్ హన్నా.

అలాంటి నార్తర్న్ కింగ్ కోబ్రా ఒకటి జనవాసాల్లోకి రావడంతో స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. కింగ్ కోబ్రా ఓ ఇరుకైన సందులో పాకుతుండటంతో దాని వద్దకు నేరుగా ఎదురుగా చేరుకోవాల్సి వచ్చింది.

అయినా ఆ స్నేక్ క్యాచర్ ఏ మాత్రం బెదిరిపోకుండా తన వద్ద ఉన్న గోనే సంచికి ఓ పైపు ముక్కను ముందువైపు తగిలించి దానిని కింగ్ కోబ్రా ముందు పెట్టాడు. స్నేక్‌ క్యాచర్‌ దానిని పట్టే విధానం చూస్తే వెన్నులో వణుకు పట్టాల్సిందే. దానిని చూసిన కింగ్ కోబ్రా తొలుత దానిలో దూరెందుకు నిరాకరిస్తూ స్నేక్ క్యాచర్ పై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ ఎట్టకేలకు స్నేక్‌ క్యాచర్‌ పట్టేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దానిని పట్టే విధానం చూస్తే గుండెలో వణుకు పుట్టాల్సిందే. ఆసియాలో భారత్ నుంచి దక్షిన చైనా వరకు ఉన్న ఆగ్నేసియా ప్రాంతంలో కనిపించే నార్తర్న్ కింగ్ కోబ్రాలను తెలుగు రాష్ట్రాలలో గిరినాగుగా పిలుస్తుంటారు.

ఇవి కూడా చదవండి