Girl fights Robber: తొమ్మిదేళ్ల చిన్నారి తన తల్లితో కలిసి కిరాణా షాపునకు వెళ్లింది. ఈ క్రమంలో సరుకులు తీసుకోని షాపు నుంచి బయటకు రాగానే.. చిన్నారి తల్లి దగ్గరున్న పర్సును దొంగలించేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడు. దీంతో ఆ చిన్నారి అతనిపై తిరగబడింది. దుండగుడిపై పిడిగుద్దులతో విరుచుకుపడింది. దీంతో అతను అక్కడినుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో. ఆ చిన్నారిని నెటిజన్లంతా ప్రశంసిస్తున్నారు. చిన్నారి విరోచితంగా దొంగతో పోరాడి తల్లిని రక్షించిందంటూ పోలీసు అధికారులు సన్మానించారు. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన నవంబర్ 2న జరిగినట్లు వెస్ట్ పామ్ బీచ్ పోలీసులు తెలిపారు.
జర్నీ నెల్సన్ ఆమె తల్లి డేనియల్ మోబ్లీ కిరాణా సామాన్లు తీసుకునేందుకు దుకాణానికి వెళ్లారు. షాపింగ్ అనంతరం వారు బయట పార్క్ చేసిన కారు దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే మాటు వేసిన ఓ దుండగుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె తల్లి పర్సు దొంగిలించడానికి ప్రయత్నించాడు. ఆమెను బలవంతంగా కిందపడేసి పర్చు లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొమ్మిదేళ్ల జర్నీ నెల్సన్ ఆ దుండగుడిని అడ్డుకుంది. వెంటనే నిందితుడిపై పంచ్‌ల వర్షం కురిపించింది. ముఖంపై పిడిగుద్దులతో విరుచుకుపడటంతో.. అతను అక్కడి నుంచి పరారయ్యాడు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ధైర్యవంతురాలైన బాలికను వెస్ట్ పామ్ బీచ్ పోలీసులు సన్మానం చేశారు. అనంతరం రెండురోజుల తర్వాత నిందితుడిని డిమెట్రియస్ జాక్సన్‌గా గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జర్నీని ధైర్యసాహసాలకు పోలీసు శాఖ పతకం, సర్టిఫికేట్‌తో సత్కరించింది. పోలీస్ చీఫ్ ఫ్రాంక్ అడెర్లీ మాట్లాడుతూ.. జర్నీ ధైర్యాన్ని చూసి తానే షాక్ అయ్యానని పేర్కొన్నారు. ఆమె ధైర్యసహాసాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
Also Read: