Viral Video: తగ్గేదేలే.. 103 ఏళ్ల వయసులో బామ్మ అద్భుత సాహసం.. గిన్నిస్ బుక్‌లో చోటు..!

|

May 31, 2022 | 12:32 PM

శతాధిక వృద్దురాలు టాండమ్ పారాచూట్ జంప్‌ని చేసి.. ప్రపంచంలోనే ఇటువంటి సాహసం చేసిన అతి పెద్ద వయసున్న వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు

Viral Video: తగ్గేదేలే.. 103 ఏళ్ల వయసులో బామ్మ అద్భుత సాహసం.. గిన్నిస్ బుక్‌లో చోటు..!
Viral Video
Follow us on

Viral Video: ఏదైనా సాధించాలనే తపన ఉంటే ‘వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే.. ఇదే విషయాన్ని అనేక మంది నిరూపిస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంది వృద్ధులు సాహస క్రీడల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి విజయాలను నమోదు చేసుకోవడమే కాదు.. నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా ఓ శతాధిక వృద్ధురాలు సరికొత్త రికార్డ్ సృష్టించించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే..

శతాధిక వృద్దురాలు టాండమ్ పారాచూట్ జంప్‌ని చేసి.. ప్రపంచంలోనే ఇటువంటి సాహసం చేసిన అతి పెద్ద వయసున్న వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. ఈసారి 103 ఏళ్ల రూట్ లార్సన్ అనే  స్వీడిష్ బామ్మ  మోటాలాలో పారాచూటిస్ట్ జోకిమ్ జోహన్సన్‌తో కలిసి టాండమ్ పారాచూట్ జంప్ చేసి.. సరికొత్త రికార్డుని సృష్టించారు.   ఉత్కంఠభరితమైన అనుభవం తర్వాత.. తాను ఇలా జంప్ చేయడం చాలా అద్భుతంగా ఉం ని.. తాను ఎప్పటి నుంచో ఈ విషయం గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పారు. అంతా అనుకున్నట్లుగానే జరిగింది” అని బామ్మ స్వీడిష్ వార్తా సంస్థ TTకి చెప్పారు.

లార్సన్ కుటుంబం, స్నేహితులు ఆమె జోకిమ్ జాన్సన్‌తో కలిసి జంప్ చేస్తున్న సమయంలో ఎయిర్‌ఫీల్డ్ నుండి వీక్షించారు.  ఈ జంట కిందకి దిగి నేలను సాఫీగా దిగారు. ఆ వెంటనే.. అక్కడ ఉన్న సహాయకులు లార్సన్‌ను పరిశీలించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు చెందిన ఒక అధికారి జంప్ ని రికార్డ్ చేశారు. గతంలో ఉన్న రికార్డ్ ను  103 ఏళ్ల 181 రోజుల రికార్డును అధిగమించినట్లు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

తాను 100 సంవత్సరాలలో చాలా పనులు చేసాను.. అయితే ఇలాంటి పనులు ఎప్పుడు ప్రయత్నించలేదు.. కనుక ఇప్పుడు తాను చేయగలిగినంత చేయాలనీ నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇది భయానకంగా, ఉత్కంఠభరితంగా ఉందని చెప్పారు.  డైవ్ విజయవంతమైన తర్వాత ఈ బామ్మ తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.