Humanity: దానం గొప్పదనం గురించి రామాయణం (Ramayana), మహాభారతం(Mahabharatam) వంటి అనేక పురాణాల్లో పేర్కొన్నారు. మనిషి సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించి ఆదుకోవడంలోని గొప్పదనం గురించి వివరించారు. అన్నదానం (Annadanam ), వస్త్ర దానం, విద్యాదానం ఇలా అనేకరకాల దానాలు ఉన్నాయి. అయితే దాహం వేసిన మనిషికి నీరు ఇవ్వడం ఎంతో పుణ్యమని.. ఇలా దాహంతో ఉన్నవారి దాహార్తిని తీర్చేవారికి కాశీకి వెళ్లి వచ్చినంత పుణ్యం లభిస్తుందని పెద్దలు తరచుగా చెప్పేమాట. అయితే ఇలా పెద్దలు చెప్పిన దాన గుణాన్ని కొంతమంది పట్టించుకోరు.. తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ మరికొందరు.. ఆపదలో ఉన్నవాడికి సాయం చేయడానికి వెనుకాడరు.. ఇలాంటి రకరకాల వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొన్ని వీడియోలు, ఫోటోలు మాత్రమే హృదయాన్ని ఆకట్టుకుంటాయి. తాజాగా అలాంటి హృదయాన్ని హత్తుకునే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన అనంతరం ఎవరైనా సరే.. ఒకే అంటారు.. “దీనినే మానవత్వం అంటారు” ఈ ఫొటోలో ఉన్న మహిళ మానవత్వానికి ఉదాహరణగా నిలిచింది. ఇలాంటి వారిని చూసినప్పుడే.. ఇంకా భూమి మీద మానవత్వం మిగిలి ఉంది అనిపిస్తుంది.
వైరల్ అవుతున్న ఫొటోలో ఒక మహిళ స్కూటర్ మీద వెళ్తూ రోడ్డుమీద సిగ్నల్ పడడంతో ఆగినట్లు ఉంది. అయితే ఎండ వేడికి స్కార్ఫ్ కట్టుకుని ఉంది. తన స్కూటర్ దగ్గరకు వచ్చిన ఓ చిన్నారి బాలుడికి తన వాటర్ బాటిల్ లోని నీరు ఇస్తూ కనిపించింది.
A Picture full of message.
Respect! #SummerTime #HeatWave pic.twitter.com/zKZ8JJ7KUO
— Rambhai Mokariya (@irammokariya) April 25, 2022
ఈ ఫోటోను రాజ్యసభ ఎంపీ రాంభాయ్ మొకారియా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఫోటో ప్రసుత్తం రీ ట్విట్స్ తో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వేల సంఖ్యలో లైక్‌లు, వందల కొద్దీ రీట్వీట్లు వచ్చాయి. అంతేకాదు ఈ చిత్రాన్ని చూసిన జనాలు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మానవత్వానికి సేవ చేసే చేతులు.. దేవుణ్ణి ప్రార్థించే పెదవులంత గొప్పవి అని ఒక నెటిజన్ స్పందించగా.. మరొక వినియోగదారు, ‘ఈ ఫోటో చూస్తుంటే, ప్రజలలో మానవత్వం ఇంకా సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించాడు.
Also Read :
PM SVANidhi: చిరు వ్యాపారస్తులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పీఎం స్వీనిధి పథక కాలం పొడిగింపు
Shiva Purana: ఇలాంటి సంకేతాలు కనిపిస్తే ఆరు మాసాల్లో మరణం.. శివపురాణం ఏం చెబుతోంది?