Viral Photo: నెటిజన్లను కదిలించిన ఫొటో.. తండ్రిని భుజాన మోశాడు.. చివరికి..

|

Jan 17, 2022 | 1:03 PM

Viral Photo: బ్రెజిల్‌లో అమెజాన్‌ అడవుల గుండా ఓ వృద్ధుడిని భుజాన మోసుకుంటూ వెళ్తున్న ఒక తెగ యువకుడి ఫొటో సోషల్‌ మీడియాను..

Viral Photo: నెటిజన్లను కదిలించిన ఫొటో.. తండ్రిని భుజాన మోశాడు.. చివరికి..
Follow us on

Viral Photo: బ్రెజిల్‌లో అమెజాన్‌ అడవుల గుండా ఓ వృద్ధుడిని భుజాన మోసుకుంటూ వెళ్తున్న ఒక తెగ యువకుడి ఫొటో సోషల్‌ మీడియాను కదిలించింది. 24 ఏళ్ళ తైవీ భుజాన ఉంది అతని తండ్రి వాహూ. ఆరు గంటల కాలినడకన వాగులు దాటి ప్రయాణించాడు. వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు చేరుకుని.. తిరిగి మళ్లీ ఆరు గంటల ప్రయాణంతో ఇంటికి చేరుకున్నాడు. వ్యాక్సినేషన్‌ కోసం అలా తండ్రిని మోసుకుంటూ వెళ్లాడు. తండ్రికి చూపు సరిగా లేదు. పైగా అనారోగ్యం ఉంది. ‘ఈరోజుల్లో ఇలాంటి కొడుకు ఉంటాడా?’ అనే అభిప్రాయమే ఎక్కువగా వ్యక్తమైంది.

డాక్టర్‌ ఎరిక్‌ ఈ దృశ్యాన్ని క్లిక్‌మనిపించారు. సాయం చేసేందుకు తాము ముందుకు వెళ్లినా.. వద్దని సున్నితంగా తిరస్కరించాడట తైవీ. వాస్తవానికి ఈ ఫొటో కొత్తది కాదు. కిందటి ఏడాదిలో తీసింది. పైగా ఈ కథ విషాదాంతమైంది. ఈ తండ్రీకొడుకులు జోయ్‌ గిరిజన తెగకు చెందినవాళ్లు. తైవీ, అతని తండ్రిని మొదటి డోస్‌వ్యాక్సినేషన్‌ కోసం వెళ్తుండగా తీసిన ఫొటో. గత ఏడాది సెప్టెంబర్‌లో వాహూ చనిపోయాడు. ఆయన మరణానికి కారణాలు తెలియవు. తైవీ ఆ కుటుంబానికి పెద్దగా మారాడు. ఈ మధ్యే మూడో వ్యాక్సిన్‌ డోస్‌ తీసుకున్నాడు కూడా. బ్రెజిల్‌లో గిరిజన గూడేలను కరోనా వెంటాడుతోంది. 853 మంది మాత్రమే చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నా.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని తెగ పెద్దలు చెప్తున్నారు.

 

 

ఇవి కూడా చదవండి:

Phone Storage: మీ స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజీ నిండిపోయిందా..? ఇలా చేయండి..!

White Label ATM: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గుడ్‌న్యూస్‌.. రానున్న రోజుల్లో 20 వేలకుపైగా కొత్త ఏటీఎంల ఏర్పాటు..!