Viral Photo: ఎండలో నిలబడిన పిల్లాడికి తన కాళ్ళని చెప్పులు చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఫోటో నెట్టింట్లో వైరల్..

|

May 21, 2022 | 7:59 AM

మరోసారి తనదైన శైలిలో మానవత్వం చాటుకుని రంజిత్ వార్తల్లో నిలిచారు. కాళ్ళు లేకుండా ఎండలో నడుస్తున్న బాలుడిని వెంటనే రంజిత్ ఆ పిల్లవాడిని తన బూట్లపై నిలబెట్టాడు. రెడ్ సిగ్నల్ పడి రోడ్డుమీద ట్రాఫిక్ ఆగిన అనంతరం.. బాలుడిని రోడ్డు దాటించాడు.

Viral Photo: ఎండలో నిలబడిన పిల్లాడికి తన కాళ్ళని చెప్పులు చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఫోటో నెట్టింట్లో వైరల్..
Indore Dancing Cop
Follow us on

Viral Photo: ఇండోర్ ట్రాఫిక్ పోలీసు (Indore Dancing Cop) రంజిత్  తాను చేసే పనులతో ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తాడు. తాజాగా రంజిత్ కు చెందిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో అతను ఒక పిల్లవాడిని ఎండ నుండి రక్షించడం కనిపిస్తుంది. ఇదే విషయంపై రంజిత్‌తో మాట్లాడగా.. ఇద్దరు పిల్లలు ఎండలో తిరుగుతున్నారని, ఒక పిల్లాడు చెప్పులు వేసుకుని ఉన్నాడని, మరో చిన్నారికి చెప్పులు లేవని చెప్పారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు ఆ బాలురు  చేరుకునే సరికి సిగ్నల్ ఆన్ అయిందని రంజిత్ చెప్పారు. ఇంతలో పిల్లలు రోడ్డు క్రాస్ చేయడానికి రెడీ అయ్యారు. అయితే సిగ్నల్ పడడంతో.. వాహనాలు రోడ్డుమీద వస్తూపోతూ ఉన్నాయి.  కొంచెం సేపటి తర్వాత గ్రీన్ సిగ్నల్ పడడంతో  రోడ్డు దాటడానికి యత్నిస్తున్న ఇద్దరు బాలురు రోడ్డుమీద నిలబడిపోయారు. అయితే ఆ సమయంలో చెప్పు లేని పిల్లవాడు కాళ్ళు ఎండ బారిన పడ్డాయి. పాదాలు కాలిపోతుంటే.. ఆ బాలుడు తీవ్రమైన బాధను అనుభవిస్తున్నాడు.. ఈ దృశ్యాన్ని చూసిన రంజిత్ వెంటనే స్పందించాడు. వెంటనే రంజిత్ ఆ పిల్లవాడిని తన బూట్లపై నిలబెట్టాడు. రెడ్ సిగ్నల్ పడి రోడ్డుమీద ట్రాఫిక్ ఆగిన అనంతరం.. బాలుడిని రోడ్డు దాటించాడు.

అదే సమయంలో రంజిత్ ఆ ఇద్దరు బాలురతో మాట్లాడాడు. ఈ సమయంలో వారి ఆర్థిక సమస్యల గురించి తెలుసుకున్నాడు. ఈ సమయంలో పిల్లలు రంజిత్‌కు ఇలా చిన్న పని చేస్తూ తన కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేస్తున్నట్లు తెలుసుకున్నారు. ఆ పిల్లల  కుటుంబం ఆర్ధిక పరిస్థితి గురించి తెలియగానే రంజిత్ ఉద్వేగానికి లోనయ్యారు. వెంటనే రంజిత్ పక్కనే ఉన్న షాపులో ఆ చిన్నారి బాలుడికి చెప్పులు కొనిచ్చాడు. అనంతరం ఆ ఇద్దరు పిల్లలను సురక్షితంగా అక్కడ నుంచి పంపించేశాడు. ప్రస్తుతం ఈ  ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.  రానున్న రోజుల్లో కూడా ఇలాగే ప్రజలకు సహాయం చేస్తానని రంజిత్ చెబుతుండగా.. ఇద్దరు పిల్లలకు సహాయం చేసిన సీనియర్ అధికారులు కూడా రంజిత్‌ను ప్రశంసించారు.

మరిన్నిట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..