Viral News: ఆసుపత్రి పొరపాటు కారణంగా మహిళ గర్భవతి.. బిడ్డ పోషణ ఖర్చులు డిమాండ్ చేస్తున్న దంపతులు

|

Nov 02, 2024 | 8:51 AM

ఆసుపత్రి సిబ్బంది తప్పిదంతో ఓ మహిళ గర్భం దాల్చింది, ఇప్పుడు తమ బిడ్డ పోషణ కోసం ఆ దంపతులు డిమాండ్ చేస్తున్న విచిత్రమైన ఉదంతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వింత ఘటన మిన్నెసోటా నుంచి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివసిస్తున్న ఓ జంట ఆస్పత్రిపై కేసు పెట్టింది. ఆసుపత్రి తప్పిదం వల్లే మహిళ గర్భం దాల్చిందని దంపతులు ఆరోపిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఆసుపత్రి తమ బిడ్డ పోషణకు అయ్యే ఖర్చులన్నీ భరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Viral News: ఆసుపత్రి పొరపాటు కారణంగా మహిళ గర్భవతి.. బిడ్డ పోషణ ఖర్చులు డిమాండ్ చేస్తున్న దంపతులు
Viral News
Follow us on

ప్రస్తుత కాలంలో కుటుంబ నియంత్రణ గురించి ప్రజలకు మరింత అవగాహన కలిగింది. ఇప్పుడు ఒకరిద్దరు పిల్లలంటే చాలు అనుకునే పరిస్థితి నెలకొంది. అవాంఛిత గర్భధారణను నివారించడానికి జంటలు స్టెరిలైజేషన్‌ను ఆశ్రయించడానికి ఇదే కారణం. గర్భధారణను నివారించడానికి ఇది చాలా ఖచ్చితమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గం. అయితే కొన్నిసార్లు దీనికి సంబంధించి సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన ఓ అంశం ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఈ కేసు మిన్నెసోటాకు చెందినది. ఇక్కడ నివసిస్తున్న ఒక జంట యూరాలజీ ప్రాక్టీషనర్‌పై దావా వేశారు. ఆసుపత్రి తప్పిదం వల్లే తాను గర్భవతి అయ్యానని ఆ మహిళ చెబుతోంది. మిన్నెసోటా యూరాలజీ ప్రాక్టీస్‌లో ఒక నర్సు తనకు వేసెక్టమీ ఆపరేషన్ చేయడంలో విఫలమైందని భర్త ఆరోపించాడు. దీని కారణంగా అతని భార్య అనుకోని పద్ధతిలో గర్భవతి అయ్యింది. బిడ్డకు జన్మనివ్వవలసి వచ్చింది. ఇప్పుడు జీవితాంతం తమ బిడ్డ ఖర్చు మొత్తం ఆ నర్స్ భరించాలని కోరుకుంటున్నామని దంపతులు చెప్పారు.

కోర్టు నిర్ణయం ఏమిటంటే?

ఇవి కూడా చదవండి

2023 సంవత్సరంలో ఈ జంట తాము అసలు పిల్లలకు జన్మనివ్వాలని అనుకోలేదని.. ఇది తమ ప్రణాళిక లేని గర్భం అంటూ కోర్టులో కేసు వేశారు. కోర్టులో సమర్పించిన పత్రాల ప్రకారం.. పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్స చేసిన నర్సు ఇప్పుడు మరణించింది. అదే నర్సు 2018లో స్టీవెన్‌కు వేసెక్టమీ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత ఆ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని తప్పుడు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత ఈ జంట ఈ అవాంఛిత గర్భాన్ని ఎదుర్కొంది.

అంతేకాదు ఈ దంపతులు తమకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పారు. ఇప్పటికే వారి పోషణలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందుకే తము ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. వేసెక్టమీ నివేదిక ఖచ్చితంగా సరైనదని తాము భావించినట్లు దంపతులు చెప్పారు. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత మార్చి 2023లో మేగాన్ 15 వారాల గర్భవతి అని తెలిసింది.

ఇవన్నీ విన్న తర్వాత ఆ జంట ఆపరేషన్ చేయించుకున్న ఆసుపత్రిపై కోర్టులో కేసు దాఖలు చేసింది. ఆ ఆస్పత్రి నుంచి తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయమని కోరింది. అయితే కోర్టు ఈ విషయంలో వచ్చే వారం విచారణకు వెళ్లనుంది.

మరిన్ని ట్రేండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..