ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచం వింత జీవులతో నిండి ఉంది. అలాంటి జీవి మన కనుల ముందుకు వచ్చినప్పుడల్లా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజంగా ప్రకృతిని పరిశీలిస్తే ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో మనకు ఏదొక వింతను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఓ స్పైడర్ పతాక వార్తల్లో నిలుస్తోంది. వీటి స్వరూపం సైంటిస్టులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మీడియా నివేదికల ప్రకారం కొత్త జీవి థాయ్‌లాండ్ లో వెలుగులోకి వచ్చింది. ఫాంగ్-న్గా లో థాయ్ పరిశోధకులు టరాన్టులా స్పైడర్ అనే కొత్త జీవి గురించి తెలుసుకున్నారు. ఇది ముదురు నీలం రంగులో కనిపిస్తుంది. ఈ నీలం రంగు జీవులు చాలా అరుదు. ఈ స్పైడర్‌ని చూసిన తర్వాత డాక్టర్ నరిన్ చోంఫు ఫుంగ్ ఈ సంఘటనపై స్పందించారు. తాము కొత్త జాతి సాలీడు కోసం వెతకడంలో బిజీగా ఉన్నాము. ఆ సమయంలో తాము కొత్త సాలీడును కనుగొన్నామని తెలిపారు.
ఈ సాలీడు గురించి శాస్త్రవేత్త మాట్లాడుతూ.. తాము తమ అన్వేషణలో ముందుకు సాగుతున్నప్పుడు.. ఈ సాలీడు చెట్టులోని ఖాళీ ట్రంక్ లోపల దాగి ఉన్న మడ అడవుల్లో కనిపించిందని చెప్పారు. శాస్త్రవేత్తల ప్రకారం వారు ఈ జాతికి చిలోబ్రాకిస్ నతని చారమ్ అని పేరు పెట్టారు. ఈ సాలీడు రంగును చూసి సైంటిస్టులు దానికి అడవి రత్నం అని పేరు పెట్టారు. ఇంగ్లీష్ వెబ్‌సైట్ సైన్స్ అలర్ట్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఈ నీలం రంగు పిగ్మెంటేషన్ వల్ల కాదు.. సహజ నిర్మాణాల వల్ల వచ్చిందని పేర్కొన్నారు.
#Tarantula
🕷A “blue” tarantula unknown to science was discovered in the forests of southern Thailand, – ForbesThe legs of this unusual spider are electric blue – an extremely rare occurrence for this type of arthropod. A group of researchers discovered a spider in the hollow… pic.twitter.com/TVU1omRs3Z
— UNEWS (@UNEWSworld) September 28, 2023
ఈ సాలీడు రంగు ప్రజలను బాగా ఆకర్షిస్తుంది. ప్రజలు తమ స్వంత ప్రయోజనం కోసం ఈ సాలీడుని కొనుగోలు చేసి అమ్ముతున్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ సాలీడు విషపూరితమైనది కాదు. ఈ కారణంగానే గత కొంత కాలంగా సాలె పురుగుల అక్రమ వ్యాపారంలో ఈ సాలీడు కొనుగోలు, విక్రయాలు జరుగుతున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..