AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఐదేళ్ల కొడుకు ప్రాణాల కోసం మొసలితో తలపడిన తల్లి… వీరోచిత పోరాటం తర్వాత ఏమైందంటే…

బిడ్డ మీద తల్లికి ఉండే ప్రేమ మాటల్లో వర్ణించలేనిది. బిడ్డకు ఆపద ఉన్నదంటే ప్రాణాలను ఆడ్డేసైనా కాపాడుకుంటుంది. మనిషి అయినా, జంతువు అయినా తన పిల్లలను కంటికి రెర్పలా కాపాడుకుంటుంది. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియలో అనేకం కనిపిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వార్తనే ఒకటి చక్కర్లు కొడుతోంది. తన ఐదేళ్ల...

Viral News: ఐదేళ్ల కొడుకు ప్రాణాల కోసం మొసలితో తలపడిన తల్లి... వీరోచిత పోరాటం తర్వాత ఏమైందంటే...
Woman Fight With Crocodile Image Credit source: Representational AI image
K Sammaiah
|

Updated on: Aug 20, 2025 | 7:11 PM

Share

బిడ్డ మీద తల్లికి ఉండే ప్రేమ మాటల్లో వర్ణించలేనిది. బిడ్డకు ఆపద ఉన్నదంటే ప్రాణాలను ఆడ్డేసైనా కాపాడుకుంటుంది. మనిషి అయినా, జంతువు అయినా తన పిల్లలను కంటికి రెర్పలా కాపాడుకుంటుంది. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియలో అనేకం కనిపిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వార్తనే ఒకటి చక్కర్లు కొడుతోంది. తన ఐదేళ్ల కుమారుడిని కాపాడుకోవడానికి ఓ తల్లి ఏకంగా మొసలితో కలపడింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బహ్రాయిచ్‌లోని ధాకియా గ్రామంలో చోటుచేసుకుంది.

సోమవారం సాయంత్రం ఒక తల్లి తన ఐదేళ్ల కుమారుడిని రక్షించుకోవడానికి మొసలితో పోరాడింది. ఇంటి దగ్గర కాలువ వద్ద బాలుడు ఆడుకుంటున్న సమయంలో ఓ హఠాత్పరిణామం జరిగింది. ఒక మొసలి అకస్మాత్తుగా నీటి నుండి బయటకు వచ్చి బాలుడిని పట్టుకుంది. మొసలి బాలుడిని నీటిలోకి లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా, అతని అరుపులు విన్న తల్లి మాయ (40) శివంగిలా మారింది. వెంటనే అక్కడికి పరుగున వెళ్లి మొసలితో పోరాటం చేసి బిడ్డను కాపాడుకుంది.

మొసలితో మాయ ఐదు నిమిషాలపాటు వీరోచితంగా పోరాడినట్లు స్థానికులు తెలిపారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఆమె తన చేతులతో మొసలిని కొడుతూ తన కొడుకును రక్షించుకుంది. తరువాత ఆమెకు ఒక ఇనుప రాడ్ దొరకడంతో మొసలిపై బలంగా దాడి చేసింద.ఇ వెంటనే అది ఆమె కొడుకును వదిలిపెట్టింది. ఈ పోరాటంలో తల్లి మాయతో పాటు కుమారుడు ఇద్దరూ గాయపడ్డారు. మాయకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు, కానీ వీరుకి తీవ్ర గాయాలు కావడంతో ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నాడు.

తన పోరాటంపై మాయ స్పందించారు. “మొసలి నా కుమారుడిని కిందకు లాగుతోంది, కానీ నేను నా శక్తినంతా ఉపయోగించి పట్టుకున్నాను. నేను దాన్ని కొట్టాను, నా దగ్గర ఉన్న ప్రతిదానితో నేను పోరాడాను. చివరికి, నేను పట్టుకున్న ఇనుప రాడ్‌తో గట్టిగా బాదడంతో దెబ్బ తగిలిన తర్వాత అది నా బిడ్డను వదిలేసింది. నా కొడుకు బతికిపోయాడు అదే నాకు ముఖ్యం.” అంటూ మాయ చెప్పుకొచ్చింది.

ఈ సంఘటన గురించి మాజీ గ్రామ సర్పంచ్ రాజ్‌ కుమార్ సింగ్ అధికారులకు సమాచారం అందించారు. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రామ్ సింగ్ యాదవ్ బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించి విచారణ చేపట్టింది. మొసలిని పట్టుకోవడానికి ఒక ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. హామీ ఇచ్చారు.

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్