Viral News: రూ.31 కోట్ల విలువైన ఇల్లు కేవలం రూ. 1000లకే.. సొంత కావాలంటే డబ్బు కాదు అదృష్టం కావాలి

వాస్తవానికి ఇది ఒక రకమైన లక్కీ డ్రా అని చెప్పవచ్చు. ఈ లాటరీలో గెలిచిన వ్యక్తికి సౌకర్యాలతో ఉన్న బంగ్లా ఇవ్వబడుతుంది. ప్రముఖ నటుడు అలిస్టర్ మెక్‌గోవన్ కూడా ఈ డ్రాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ డ్రాలో వచ్చే డబ్బును ప్రసిద్ధ NGO WWF కి ఇవ్వనున్నారు. ఈ సంస్థ అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ, వాటి ఆవాసాల రక్షణ, అడవుల రక్షణ, అటవీ నిర్మూలనను ఆపడం వంటి అంశాలపై పనిచేస్తుంది.

Viral News: రూ.31 కోట్ల విలువైన ఇల్లు కేవలం రూ. 1000లకే.. సొంత కావాలంటే డబ్బు కాదు అదృష్టం కావాలి
Uk Omaze House
Image Credit source: pixabay

Updated on: Feb 16, 2024 | 8:43 PM

ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కావాలని కోరుకుంటారు. తమ ఆర్ధిక శక్తికి తగినట్లు ఇల్లు కట్టుకుంటారు. చాలా మంది తమ జీవిత సంపాదన అంతా చిన్న ఇల్లు కట్టుకోవడానికి వెచ్చిస్తారు. అయినా తమ కలను నెరవేర్చుకోలేకపోతున్నారు. దీనికి ఆర్ధిక ఇబ్బందులు ఒక కారణం. నిజానికి  నేటి కాలంలో పెరుగుతున్న భూమి ధరలతో ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లును ఏర్పాటు చేసుకోవడం అంత సులభం కాదు. అటువంటి పరిస్థితిలో.. కేవలం వెయ్యి రూపాయలతో బంగ్లాను కొనుగోలు చేయవచ్చని చెబితే.. ఎవరైనా  నమ్మకపోవచ్చు. అయితే ఇది పూర్తిగా నిజం.

ఆంగ్ల వెబ్‌సైట్ ది సన్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం ఇప్పుడు చెబుతున్న బంగ్లా బ్రిటన్‌లోని సెయింట్ ఆగ్నెస్ బీచ్‌కు కొద్ది దూరంలో ఉంది. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ కోరుకునే సౌకర్యాలున్నాయి.  అయితే ఇలాంటి ఇల్లుని ఇంత చౌకగా ఎందుకు దొరుకుతుంది అనే ప్రశ్న ఎవరి మదిలోనైనా మెదులుతూనే ఉంటుంది. వాస్తవానికి ఈ ఇల్లును ఓమాజ్ మిలియన్ పౌండ్ హౌస్ ప్రత్యేక ప్రయోజనం కోసం తీసుకోబడింది.

ఈ ఇల్లు ఖరీదు ఎంత అంటే..

వాస్తవానికి ఇది ఒక రకమైన లక్కీ డ్రా అని చెప్పవచ్చు. ఈ లాటరీలో గెలిచిన వ్యక్తికి సౌకర్యాలతో ఉన్న బంగ్లా ఇవ్వబడుతుంది. ప్రముఖ నటుడు అలిస్టర్ మెక్‌గోవన్ కూడా ఈ డ్రాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ డ్రాలో వచ్చే డబ్బును ప్రసిద్ధ NGO WWF కి ఇవ్వనున్నారు. ఈ సంస్థ అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ, వాటి ఆవాసాల రక్షణ, అడవుల రక్షణ, అటవీ నిర్మూలనను ఆపడం వంటి అంశాలపై పనిచేస్తుంది.

ఈ ఇల్లు లోపల గదులు, పార్కింగ్, అందమైన ప్రాంగణాన్ని డిజైన్ చేశారు. అంతేకాదు భవనం చుట్టూ అందమైన ఒక తోట కూడా ఉంది. ఈ అందమైన ఆవరణలో కూర్చుని ప్రకృతికి దగ్గరగా జీవించవచ్చు. ఈ ఇంట్లో రెండు డబుల్ బెడ్‌రూమ్‌లు, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫ్రీ-స్టాండింగ్ బాత్రూమ్ ఉన్నాయి. దీనితో పాటు చాలా పెద్ద షవర్ రూమ్ ఉంది. ఇంటి వెనుక తోటలను అందంగా అలంకరించారు. ఇప్పుడు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అదృష్టం కలిసి వస్తే  డ్రాలో ఈ ఇంటిని సొంతం చేసుకంటారు. ఖచ్చితంగా ధనవంతులు అవుతారు ఎందుకంటే దీని అసలు ధర 31 కోట్లు. ఈ ఇంటిని డ్రాలో గెలుచుకున్నవారు అద్దెకు ఇచ్చినా సరే  నెలకు మూడు లక్షల రూపాయల అద్దె వస్తుంది. అంతేకాదు ఈ బంగ్లాతో పాటు కోటి రూపాయలు కూడా ఇవ్వనున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..