Viral News: రక్షాబంధన్ కు సెలవు అడిగింది.. ఉద్యోగం పోగొట్టుకుంది.. కంపెనీ స్పందన ఏమిటంటే?

|

Aug 16, 2024 | 3:23 PM

సుదూర ప్రాంతాలల్లో ఉన్నారు అయితే తమ సంతోషాన్ని తెలియజేస్తూ రాఖీని పోస్టల్ ద్వారానో.. లేదా వివిధ మార్గాల్లో పంపిస్తారు. అయితే దగ్గరగా ఉన్నవారు మాత్రం స్వయంగా ఇంటికి వెళ్లి తమ అన్నదమ్ములకు రాఖీ కట్టాలని భావిస్తారు. అయితే రాఖీ కట్టడం కోసం సెలవు అడిగిన ఓ యువతి తన ఉద్యోగం పోగొట్టుకుంది. ఈ విచిత్ర సంఘటన పంజాబ్ లో జరిగినట్లు తెలుస్తోంది. రక్షా బంధన్ కోసం సెలవు విధానంపై ఓ ఉద్యోగిని తను పనిచేస్తున్న కంపెనీతో విభేదించింది అనే ఆరోపణతో హెచ్‌ఆర్ మేనేజర్‌ ఉద్యోగం పోగొట్టుకుంది. ఈ విషయాన్నీ బాధితుతాలు స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది

Viral News: రక్షాబంధన్ కు సెలవు అడిగింది.. ఉద్యోగం పోగొట్టుకుంది.. కంపెనీ స్పందన ఏమిటంటే?
Raksha Bandhan Leave
Follow us on

రాఖీ పండగ వస్తుందంటే చాలు మార్కెట్ లో మాత్రమే కాదు అక్కా చెల్లెళ్ళు ఓ రేంజ్ లో హడావిదిచేస్తారు. తమ అన్నదమ్ములను కావాలని.. రాఖీ కట్టాలని భావిస్తారు. దీంతో సుదూర ప్రాంతాలల్లో ఉన్నారు అయితే తమ సంతోషాన్ని తెలియజేస్తూ రాఖీని పోస్టల్ ద్వారానో.. లేదా వివిధ మార్గాల్లో పంపిస్తారు. అయితే దగ్గరగా ఉన్నవారు మాత్రం స్వయంగా ఇంటికి వెళ్లి తమ అన్నదమ్ములకు రాఖీ కట్టాలని భావిస్తారు. అయితే రాఖీ కట్టడం కోసం సెలవు అడిగిన ఓ యువతి తన ఉద్యోగం పోగొట్టుకుంది. ఈ విచిత్ర సంఘటన పంజాబ్ లో జరిగినట్లు తెలుస్తోంది. రక్షా బంధన్ కోసం సెలవు విధానంపై ఓ ఉద్యోగిని తను పనిచేస్తున్న కంపెనీతో విభేదించింది అనే ఆరోపణతో హెచ్‌ఆర్ మేనేజర్‌ ఉద్యోగం పోగొట్టుకుంది. ఈ విషయాన్నీ బాధితుతాలు స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. వివరాల్లోకి వెళ్తే..

పంజాబ్‌లోని మొహాలీలో బి9 సొల్యూషన్స్ సంస్థలో బబిన అనే మహిళ హెచ్‌ఆర్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తోంది. అయితే ఆగస్టు 16 నుంచి వరస సెలవులు రావడంతో సదరు సంస్థ తమ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులకు ఓ సర్క్యులర్ విడుదల చేసింది. వరుస సెలవులు వచ్చినందున రాఖీ పండగ రోజైన సోమవారం కూడా ఉద్యోగులు అందరూ తప్పనిసరిగా ఆఫీస్‌కు రావాలి అంటూ ఆ సర్కులర్ లో పేర్కొంది. అంతేకాదు.. రాఖీ పండగ రోజున సెలవు పెట్టినా.. ఆలస్యంగా వచ్చినా చర్యలు తీసుకుంటామని.. వారం రోజులు జీతం కట్ చేస్తామంటూ హెచ్చరించింది. అయితే కంపెనీ యాజమాన్యం ఇచ్చిన సర్క్యులర్‌ని హెచ్‌ఆర్ అయిన బబిన అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు ఒక్క రోజు సెలవు పెడితే.. ఏకంగా వారం రోజులు జీతం కట్ చేయడమ దారుణం అని.. ఈ నిబంధనకు తాను అంగీకరించను అని కంపెనీ యాజమాన్యం నిర్ణయాన్ని విబెధించింది. అన్యాయమంటూ వాదించింది. దీంతో కంపెనీ యజమాని బబినపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉద్యోగం నుంచి వెంటనే తొలగించాడు.

Viral News

కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులందరి తరపున మాట్లాడి తాను ఇప్పుడు ఉద్యోగం పోగొట్టుకోవడంతో షాక్ అయింది. అంతేకాదు ఇందుకు సంబంధించిన వాట్సప్ చాప్ స్క్రీన్ షాట్స్ ను జత చేస్తూ తన అనుభావాన్ని లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు సదరు కంపెనీ యాజమాన్య తీరుని ఓ రేంజ్ లో విమర్శిస్తున్నారు. అయితే బబిన చేసిన ఆరోపణలపై కంపెనీ యాజమాన్యం స్పందిస్తూ తాము ఎందుకు బబినను టెర్మినేట్ చేయాల్సి వచ్చిందో వివరణ కూడా ఇచ్చింది. ఆఫీసు లో బబిన ప్రవర్తన సరిగా ఉండదని.. ఆఫీస్ లో పని చేయాల్సిన సమయంలో ఆన్ లైన్ కోర్సులు చేస్తుందని.. ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుందని.. తను చేయాల్సిన పనులు కూడా మానేసి కూతురు హోమ వర్క్ చేస్తుందని ఆరోపిస్తుంది. ఇప్పటికే ఈ విషయంలో అనేక సార్లు మందలించామని వార్నింగ్ లెటర్ ఇచ్చామని తెలిపింది. ఆమె తన ప్రవర్తనని మార్చుకోకుండా ఇప్పుడు ఇలా ఉద్యోగులను రెచ్చగొడుతోందని.. అందుకనే టెర్మినేట్ చేసినట్లు కంపెనీ ఆరోపణలు చేసింది

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..