Appu Idols: పునీత్ రాజ్‌కుమార్‌కు ఫ్యాన్స్ ప్రత్యేక నివాళులు.. గణపతితో అప్పూ విగ్రహాలు ఏర్పాటు.. పూజలు

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని అభిమానులు, కన్నడ ప్రజలు గుర్తు చేసుకుంటూ.. పునీత్ ప్రతిమను గణేష్ మండపాల్లో గణపతి విగ్రహంతో పాటు ఏర్పాటు చేసి.. పూజిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Appu Idols: పునీత్ రాజ్‌కుమార్‌కు ఫ్యాన్స్ ప్రత్యేక నివాళులు.. గణపతితో అప్పూ విగ్రహాలు ఏర్పాటు.. పూజలు
Welcome Appu Idols

Updated on: Sep 02, 2022 | 12:29 PM

Vinayaka Chavithi Appu Idols: పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు.. అయితే కొందరు మరణించి చిరంజీవులు. తమ ప్రవర్తనతో మంచితనం మానవత్వంతో సదా ప్రజల మనసులో జ్ఞాపకాల్లో జీవిస్తూనే ఉంటారు. సమయం సందర్భం వస్తే.. వెంటనే వారిని అభిమానులు గుర్తు చేస్తుకుంటారు. తమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. వినాయక పర్వదినం సందర్భంగా అటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని అభిమానులు, కన్నడ ప్రజలు గుర్తు చేసుకుంటూ.. పునీత్ ప్రతిమను గణేష్ మండపాల్లో గణపతి విగ్రహంతో పాటు ఏర్పాటు చేసి.. పూజిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ గత ఏడాది అక్టోబర్‌లో 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. కన్నడ  సూపర్ స్టార్ దివంగత రాజ్‌కుమార్ చిన్న కుమారుడు పునీత్ రాజ్ కుమారు. బాలనటుడి గా అనేక సినిమాల్లో నటించిన పునీత్.. అప్పు సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు. సినిమాతో తన అభిమానులను అలరిస్తూనే అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు.  పలు స్వచ్చంద సంస్థలకు భారీ విరాళాలు ఇచ్చి ప్రజలలో ప్రాచుర్యం పొందాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గణేష్ చతుర్థి సందర్భంగా గణేష్ విగ్రహాల తయారీదారులు, అభిమానులు పునీత్ జ్ఞాపకాన్ని సజీవంగా ఉంచడానికి తమ అభిమానాన్ని చాటుకోవడానికి ఒక ప్రత్యేక మార్గాన్ని కనుగొన్నారు.  దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ప్రతిమలను బాగా రూపొందించారు.

ఇవి కూడా చదవండి

పలువురు వినాయకుడి విగ్రహాలతో పాటు దివంగత నటుడి ప్రతిమను కొనుగోలు చేసి పూజించడం కనిపించింది.

అనేక విజయవంతమైన కన్నడ చిత్రాలలో  నటించిన పునీత్  ‘పవర్‌స్టార్’గా ప్రసిద్ధి చెందారు. హీరోగా మాత్రమే కాదు..  ప్రముఖ టెలివిజన్ హోస్ట్,    గాయకుడు కూడా. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు

ఈ ఏడాది ప్రారంభంలో పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం మైసూర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. దివంగత భర్త తరపున పునీత్ భార్య అశ్విని డాక్టరేట్ అందుకున్నారు.

అలాగే, రాష్ట్ర అవతరణ దినోత్సవమైన కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా నవంబర్ 1న మరణానంతరం పునీత్ రాజ్‌కుమార్‌కు ‘కర్ణాటక రత్న’ అవార్డును ప్రదానం చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆగస్టులో ప్రకటించారు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..