Viral News: ఏం ఐడియా సర్జీ.. డైపర్ లో తుపాకీ బుల్లెట్ల తరలింపు..

|

Dec 21, 2023 | 2:35 PM

డిసెంబర్ 20వ తేదీన న్యూయార్క్ లోని లాగార్డియా ఎయిర్ పోర్టులో బేబీ డైపర్ లో 17 బుల్లెట్లను అక్రమంగా తరలిస్తున్నట్లు భద్రతా అధికారులు కనుగొన్నారు. ఈ విషయాన్ని రవాణా భద్రతా అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఎయిర్ పోరట్లు సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద ఎక్స్ రే మెషీన్ లో అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణీకుల క్యారీ బ్యాగ్ నుంచి ఓ డైపర్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంబంధిత వ్యక్తిని అదుపులోకి..

Viral News: ఏం ఐడియా సర్జీ.. డైపర్ లో తుపాకీ బుల్లెట్ల తరలింపు..
Bullets In Diaper
Follow us on

ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. సరైన సమయంలో చాకచక్యంగా వ్యవహరిస్తే విజయం వరిస్తుంది. ఇప్పుడు ఇదే ఫార్మాలాను స్మగ్లింగ్ చేయడంలో కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పటికే బంగారం స్మగ్లింగ్ ని తరలించడంలో ఎన్నో రకాల జిమ్మిక్కులు ఉపయోగిస్తున్నారు. నిజంగానే వారు స్మగ్లింగ్ చేసే విధానం చూస్తే అవాక్కవ్వాల్సిందే. అదే విధంగా వారికి తగ్గట్టుగానే పోలీసులు కూడా అడ్డుకట్ట వేస్తున్నారు. తాజాగా.. పిల్లల డైపర్ లో తుపాకీ బుల్లెట్లు పెట్టి అక్రమంగా తరలించడానికి ట్రై చేశారు. కట్ చేస్తే పోలీసులకు దొరికేసారు. ఈ ఘటన న్యూయార్క్ లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే..

డిసెంబర్ 20వ తేదీన న్యూయార్క్ లోని లాగార్డియా ఎయిర్ పోర్టులో బేబీ డైపర్ లో 17 బుల్లెట్లను అక్రమంగా తరలిస్తున్నట్లు భద్రతా అధికారులు కనుగొన్నారు. ఈ విషయాన్ని రవాణా భద్రతా అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఎయిర్ పోరట్లు సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద ఎక్స్ రే మెషీన్ లో అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణీకుల క్యారీ బ్యాగ్ నుంచి ఓ డైపర్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

అతన్ని విచారణ చేయగా.. మొదట ఈ డైపర్ తన బ్యాగ్ లోకి ఎలా చేరిందో తనకు తెలియదని వారించాడు. కానీ పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా.. తన స్నేహితురాలే అలా ఉంచమని చెప్పిందని వెల్లడించాడు. టీఎష్ఏ ప్రయాణికుడిని చిగాకో మిడ్ వే ఎయిర్ పోర్టుకు వెళ్లడానికి టిక్కెట్లు తీసుకున్న అర్కాన్సాస్ కు చెందిన వ్యక్తిగా గుర్తించింది.

కానీ అతని పేరు వెల్లడించలేదు. కాగా డైపర్ లో అక్రమంగా బుల్లెట్లు తరలించడంతో ఈ విషయం కాస్తా వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఈ వార్త గురించి తెలుసుకున్న నెటిజన్స్.. వాటెన్ ఐడియా సర్జీ.. వావ్ వాటే ప్లాన్.. పిల్లల డైపర్ లో ఇలా బుల్లెట్లు కూడా పెడతారని ఇప్పుడే తెలిసింది అంటూ సరదగా కామెంట్స్ చేస్తున్నారు.