ఎయిర్పోర్ట్‌లో దింపలేదని, కుక్కని చూడలేదని బాయ్ ఫ్రెండ్‌పై కేసు పెట్టిన యువతి.. ఎక్కడంటే

|

Jun 22, 2024 | 5:49 PM

భాగస్వామి భావాలకు ప్రేమ బంధంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. భావాలు కొంచెం గాయపడినా చాలు ఆ సంబంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. ప్రేమకు సంబంధించిన వింత కథలు మనకు చాలాసార్లు వెలుగులోకి రావడానికి ఇదే కారణం. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ ప్రియురాలు తన ప్రియుడిని చిన్నాచితకా విషయానికి గొడవ పడి చివరకు కోర్టు మెట్లు ఎక్కించింది.

ఎయిర్పోర్ట్‌లో దింపలేదని, కుక్కని చూడలేదని బాయ్ ఫ్రెండ్‌పై కేసు పెట్టిన యువతి.. ఎక్కడంటే
Lovers Break Up
Follow us on

ప్రేమ, పెళ్లి అనేవి మీ భాగస్వామి పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సిన సంబంధాలు. అయితే పెళ్లాం మాటని పెడచెవిన పెట్టినా పర్వాలేదు కానీ.. ప్రేయసి మాటని మాత్రం పాటించాల్సిందే అని సరదాగా కొందరు కామెంట్ చేస్తారు దీనికి ముఖ్య కారణం మీ భాగస్వామి భావాలకు ప్రేమ బంధంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. భావాలు కొంచెం గాయపడినా చాలు ఆ సంబంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. ప్రేమకు సంబంధించిన వింత కథలు మనకు చాలాసార్లు వెలుగులోకి రావడానికి ఇదే కారణం. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ ప్రియురాలు తన ప్రియుడిని చిన్నాచితకా విషయానికి గొడవ పడి చివరకు కోర్టు మెట్లు ఎక్కించింది.

ఆంగ్ల వెబ్‌సైట్ న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటు చేసుకుంది. ఓ యువతి తన ప్రేమికుడు ఎయిర్‌పోర్టుకు దింపలేదని జైలుకు పంపింది. ఎయిర్ పోర్ట్ లో డ్రాఫ్ చేయని కారణంగా ఆమె ఫ్లైట్ మిస్ అయింది. మర్నాడు విమానంలో వెళ్ళడానికి అదనంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో ఆ యువతికి తన ప్రియుడిపై చాలా కోపం వచ్చింది. ఈ చిన్న విషయానికి ఆ యువతి తమ ఆరేళ్ల బంధాన్ని తెంచుకుంది. అంతేకాదు తాను విమాన ప్రయాణం కోసం పెట్టిన డబ్బు తిరిగి ఇప్పించమంటూ కోర్టులో తన సమస్యను లేవనెత్తింది.

న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే

ఇవి కూడా చదవండి

కోర్టులో ప్రేమికురాలు మాట్లాడుతూ.. తాను ప్రిమించిన యువకుడు తనను విమానాశ్రయానికి డ్రాప్ చేయడానికి రాలేదని న్యాయమూర్తికి తెలిపింది. నిజానికి తాను ఇంట్లో లేనప్పుడు తన కుక్కను చూసుకుంటానని అతను హామీ ఇచ్చాడు. అయితే ఆ హామీని కూడా నెరవేర్చలేదు.. అతను తన ఇంటి దరిదాపుల్లోకి వెళ్లలేదు. కనుక ఇప్పుడు తనకు పరిహారం ఇప్పించండి అంటూ కోర్టులో జడ్జికి విన్నవించుకుంది. యువతి వాదన విన్న న్యాయమూర్తి రిఫరీ క్రిస్యా కౌవీ మాట్లాడుతూ.. యువతి చెప్పిన నేరాలపై చట్టపరమైన చర్యలు తీసుకోలేరు. వాగ్దానాన్ని ఉల్లంఘించినందుకు ఎవరైనా శిక్షించబడటం అసాధ్యమని అన్నారు.

అంతే కాదు ఇలాంటి చిన్న చిన్న విషయాలకే సంబంధాన్ని తెంచుకోవడం సరికాదన్నారు కోవి. అందుకే తాను యువతి పెట్టిన కేసును కొట్టివేస్తున్నానని తీర్పు ఇచ్చారు. స్టఫ్ నివేదిక ప్రకారం ఈ జంట పేర్లు తెలియాల్సి ఉంది. అయితే ఇంత జరిగిన తర్వాత ఆ ప్రిమికుడు ఆ యువతితో కలిసి జీవించడానికి ఇష్టపడడం లేదు. అందుకే కోర్టు చెప్పిన నిర్ణయంతో ఇద్దరూ నిరాశ చెందారు. అయినా వీరు బ్రేక్ కప్ చెప్పుకుని ఈ జంట విడిపోయింది.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..